విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!

'కత్తి' పట్టినా.. 'తుపాకీ' పట్టినా వెండితెరపై ఆయనో అజేయుడు. కానీ, రాజకీయ చదరంగంలో 'విజయ్' అడుగులు ఇప్పుడు ముళ్ళబాటను తలపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేళ.. ప్రముఖ సర్వే సంస్థ CPAC వెల్లడించిన అంచనాలు కోలీవుడ్ నుంచి పోలింగ్ బూత్ వరకు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయ ప్రస్థానంలో నటి త్రిష పాత్ర ఒక 'మైనస్' పాయింట్‌గా మారబోతోందన్న విశ్లేషణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

టికెట్ల పంపిణీలో 'త్రిష' ముద్ర?

రాజకీయాల్లో వారసత్వాలు, రికమెండేషన్లు కొత్తేమీ కాదు. కానీ, విజయ్ పార్టీలో త్రిష రికమెండ్ చేసిన వ్యక్తులకే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత లభిస్తోందన్న వార్త కార్యకర్తల్లో కలకలం రేపుతోంది. "ఆడది రాజ్యాలు కూల్చేయవచ్చు" అన్న నానుడిని నిజం చేస్తూ.. ఈ అంతర్గత పరిణామాలు పార్టీ పునాదులను దెబ్బతీసే ప్రమాదం ఉందని సర్వే హెచ్చరిస్తోంది. మరీ ముఖ్యంగా, త్రిష ప్రస్తుతం బీజేపీ ట్రాప్‌లో ఉన్నట్లు అందుతున్న సమాచారం విజయ్ సేనకు మింగుడుపడని అంశం. తెరవెనుక జరుగుతున్న ఈ రాజకీయ గిల్లీకజ్జాలు విజయ్ ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తున్నాయి.

Vijay Faced with Defeat in Two Key Seats CPAC Survey Highlights Trisha s Influence in Ticket Allocation

రెండు చోట్ల విజయ్‌కు ఓటమి గండం!

CPAC సర్వే ప్రకారం.. విజయ్ పోటీ చేయాలనుకుంటున్న రెండు ప్రధాన నియోజకవర్గాలు... చెన్నై జిల్లాలోని పెరంబూర్, తిరుచ్చి జిల్లాలోని తిరుచ్చి ఈస్ట్‌ స్థానాల నుంచి .. ఆయనకు ఓటమి తప్పదని అంచనాలు చెబుతున్నాయి.

  • పెరంబూర్: ఇక్కడ సేకరించిన 2800 శాంపిల్స్ విశ్లేషిస్తే పరిస్థితి ప్రతికూలంగా ఉన్నట్లు తేలింది.
  • తిరుచ్చి: 1200 శాంపిల్స్ ఆధారంగా ఇక్కడ కూడా గెలుపు గుర్రం ఎక్కడం విజయ్‌కు కష్టసాధ్యమేనని సర్వే స్పష్టం చేస్తోంది.

అయితే, విజయ్ తన వ్యూహాన్ని మార్చుకుని ఎగ్మోర్ నుంచి పోటీ చేస్తే ఫలితం సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ 81 శాతం క్రైస్తవ ఓటర్లు ఉండటం విజయ్‌కు అతిపెద్ద ప్లస్ పాయింట్ కానుంది.

చెన్నైలో పట్టు.. కానీ గమ్యం ఎటు?

మరోవైపు, విజయ్ బలం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పలేం. చెన్నై నగరంలోని 16 నియోజకవర్గాల్లో విజయ్ తన పట్టును నిరూపించుకున్నట్లు సర్వే వెల్లడించింది. యువతలో ఉన్న క్రేజ్ ఆయనకు ఓట్ల వర్షం కురిపిస్తున్నప్పటికీ.. పార్టీలోని అంతర్గత జోక్యం, ముఖ్యంగా సినీ గ్లామర్ రాజకీయ జోక్యం పార్టీని పతనం దిశగా తీసుకెళ్లే ప్రమాదం ఉంది.

గ్లామర్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తమిళనాడులో విజయ్ ప్రయాణం ఆసక్తికరంగా మారింది. కానీ, పార్టీని నడిపించడంలో సొంత నిర్ణయాల కంటే ఇతరుల రికమెండేషన్లకు చోటిస్తే.. అది రాజ్య స్థాపనకు కాకుండా, రాజ్య పతనానికే దారి తీస్తుందని CPAC విశ్లేషణ హెచ్చరిస్తోంది. విజయ్ ఇప్పుడు తన చుట్టూ ఉన్న 'మాయా లోకం' నుంచి బయటపడి వాస్తవ రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెడతారా? లేక సర్వే అంచనాలే నిజమవుతాయా? అన్నది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+