సీఎంకు ప్రత్యేక మనవి చేసిన విజయ్ కాంత్ భార్య, అదే చేస్తే సీఎం నిజంగా గ్రేట్, స్టాలిన్ మాట !
అలనాటి స్టార్ హీరో, డీఎండీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, క్యాప్టెన్ విజయకాంత్ మృతదేహాన్ని బహిరంగ ప్రదేశంలో ఖననం చేయాలని ఆయన భార్య ప్రేమలతా విజయకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు మనవి చేశారు. గురువాం ఉదయం డీఎండీకే నేత విజయకాంత్ కన్నుమూశారు. ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతూ విజయ్ కాంత్ మృతి చెందారు.
ఈ తెల్లవారుజాము విజయ్ కాంత్ ను ఇంటెన్సివ్ కేర్‌లో చేర్చారు. తెల్లవారుజామునే విజయ్ కాంత్ ఆరోగ్యం క్షీణించింది. ఐసీయూలో విజయ్ కాంత్ కు చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో ఆయన మృతి చెందారు. డీఎండీకే అధినేత విజయకాంత్ మృతదేహాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సందర్శించి నివాళులర్పించారు. విజయ్ కాంత్ పార్థివదేహానికి ప్రభుత్వ లాంచనాలతో గౌరవం అందించి అంత్యక్రియులు నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసింది.

విజయ్ కాంత్ చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ప్రేమలతను ముఖ్యమంత్రి స్టాలిన్ పరామర్శించి ఆమెకు ధైక్యం చెప్పారు. విజయ్ కాంత్ కుటుంబ సభ్యులకు సీఎం స్టాలిన్ సంతాపం తెలిపారు. ఇదే సమయంలో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ మృతదేహాన్ని బహిరంగ ప్రదేశంలో ఖననం చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ప్రేమలత విజయకాంత్ కోరారు. ఈ అభ్యర్థనను రేపటిలోగా పరిశీలించే అవకాశం ఉందని తమిళనాడు ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ మంత్రి అంటున్నారు.
విజయకాంత్ మృతి పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. తనకు చాలా సన్నిహితుడైన మిత్రుడు కెప్టెన్ విజయకాంత్ చనిపోయారు అనే వార్త తీవ్ర దిగ్భ్రాంతిని, బాధను కలిగించిందని, మంచి హృదయం కలిగి, తన కఠోర శ్రమతో సినీ పరిశ్రమలోనూ, ప్రజా జీవితంలోనూ విజయవంతమైన వ్యక్తిగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న గొప్ప సాధకుడు అని స్టాలిన్ అన్నారు.

నటుడిగా, తమిళ నటీనటుల సంఘం అధ్యక్షుడిగా, రాజకీయ పార్టీ నాయకుడిగా, శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఇలా విజయ్ కాంత్ ఏపనిచేపట్టినా దానికి పూర్తిగా కట్టుబడి, తనకు సంబంధించిన వారందరికీ అండగా నిలిచారని సీఎం స్టాలిన్ గుర్తు చేశారు. మా కుటుంబ స్నేహితుడు అయిన విజయ్ కాంత్ నాకు వ్యక్తిగతంగా చాలా సన్నిహితుడని, ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ఆదేవుడిని ప్రార్థిస్తున్నానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు ఆ రాష్ట్రానికి చెందిన అనేక మంది మంత్రులు విజయ్ కాంత్ కు నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications