ఆస్తులు జఫ్తు చేసినా, మాల్యా భారత్ రావాల్సిందే: ఈడీ
న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ అధినేత విజయ మాల్యాకు చెందిన ఆస్తులను ఆటాచ్ చేసినప్పటికీ ఆయన భారత్ రావాల్సిన ఆవశ్యకత ఉందని ఈడీ అధికారులు చెబుతున్నారు. రూ.9వేల కోట్లకు పైగా రుణాలు విజయ్ మాల్యా ఎగ్గొట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారత దేశంలోని విజయ మాల్యాకు చెందిన ఆస్తులను అటాచ్ చేయాలని భావిస్తున్నారు. దీనిపై ఈడీ అధికారులు స్పందిస్తూ.. ఆస్తులను అటాచ్ చేసినప్పటికీ.. విచారణలో భాగంగా విజయ మాల్యా భారత్ రావాలసి ఉంటుందంటున్నారు.
కేవలం ఆయనకు చెందిన డబ్బులను రికవరీ చేయడంతోనే కేసు పూర్తి కాదన్నారు. నిధులను రికవరీ చేశాక... మనీలాండరింగ్ విషయమై విచారణ చేయాల్సి ఉంటుందని చెప్పారు.

విజయ మాల్యాకు చెందిన ఆస్తుల అటాచ్ ప్రక్రియ ప్రారంభమయిందని చెబుతున్నారు. ఆయన ఆస్తుల చిట్టా జాబితాను రూపొందిస్తున్నామని, ఆ తర్వాత అటాచ్ పూర్తవుతుందని తెలిపారు.
మాల్యా ఆస్తులను జఫ్తు చేయడం విచారణలో ఓ భాగం మాత్రమేనని చెప్పారు. ఆయనను విచారించవలసి ఉంటుందన్నారు. అందుకోసం ఆయనను కచ్చితంగా భారత్ రప్పించవలసి ఉందన్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు అని చెప్పారు.
అదే విధంగా మాల్యాను విచారించడంతోనే సరిపోదంటున్నారు. మాల్యాతో పాటు బ్యాంకు అధికారుల పాత్ర కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు. తాము మాల్యాతో పాటు బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తామని చెబుతున్నారు. ఆ తర్వాత కేసు పురోగతిని సుప్రీం కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications