లిక్కర్ స్కాంలో తొలి అరెస్ట్: సిసోడియా అనుచరుడు విజయ్ నాయర్ అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగిన లిక్కర్ స్కాం కేసులో తొలి అరెస్ట్ జరిగింది. ముందు కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. మంగళవారం 'ఓన్లీ మచ్ లౌడర్' సంస్థ మాజీ సీఈఓ విజయ్ నాయర్‌ను అరెస్ట్ చేశారు. ఇతను మంత్రి మనీశ్ సిసోడియా సన్నిహితుడని తెలుస్తోంది. ఇతనిని విచారిస్తే మరిన్ని నిజాలు తెలిసే అవకాశం ఉంది.
ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో సేవలు అందిస్తున్న ఓన్లీ మచ్ లౌడర్ కంపెనీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. సంస్థకు ఇదివరకు సీఈఓగా ఉన్న విజయ్ నాయర్‌ను కేసులో ఐదో నిందితుడిగా సీబీఐ అధికారులు చేర్చారు.కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ నాయర్‌కు చెందిన కీలక ఆధారాలు లభించడంతో మంగళవారం ముంబైలో ఉన్న ఆయనను అరెస్ట్ చేశారు.

అక్కడ అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. నాయర్ ఇళ్లు, కార్యాలయాల వద్ద ఇదివరకు ఈడీ కూడా సోదాలు నిర్వహించింది. ఎక్సైజ్ పాలసీ కేసులో నాయర్ ముఖ్య కుట్రదారు అని సీబీఐ భావిస్తోంది. గతనెల 21వ తేదీన సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీచేసింది. అందులో 8 మంది ఉండగా.. వారిలో విజయ్ నాయర్ ఒకరు. అయితే రైడ్స్ నిర్వహించే సమయంలో నాయర్ అప్పటికే ఎస్కేప్ అయ్యారు.
తాను ఎక్కడికి పారిపోలేదని విజయ్ నాయర్ తెలిపారు. కొన్ని పనుల వల్ల మాత్రమే విదేశానికి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. సీబీఐ అధికారులకు టచ్‌లో ఉన్నానని.. విచారణకు సహకరిస్తున్నానని తెలిపారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications