రెండు చోట్ల విజయ్ పోటీ- టీవీకే జాబితా విడుదల: ఒక్క ఛాన్స్ ప్లీజ్
తమిళనాడు ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ అక్కడి వాతావరణం వేడెక్కుతోంది. సీట్లు, నియోజకవర్గాల పంపకాల్లో ఆయా పార్టీల అగ్రనేతలు తీరిక లేకుండా గడుపుతున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే, టీవీకే.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.
ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి.

ఈ పరిణామాల మధ్య తమిళన వెట్రి కజగం అధినేత విజయ్.. పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఆయన స్వయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రెండు నియోజకవర్గాల నుంచి బరిలో దిగనున్నారు. ఇదివరకే వార్తలు వచ్చినట్లుగా పెరంబూర్ స్థానం నుంచి విజయ్ బరిలో దిగారు. అదే సమయంలో మరో నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారు. తిరుచ్చి ఈస్ట్ నుంచి కూడా ఆయన రేసులో నిల్చొన్నారు.
ఈ జాబితాలో పలువురు పార్టీ ముఖ్య నేతల పేర్లు ఉన్నాయి. టీ నగర్ నుండి పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్, మైలాపూర్ నుండి కోశాధికారి వెంకట్ రమణన్, విల్లివాక్కం నుండి ఆదవ్ అర్జున్ పోటీ చేయనున్నారు. జాబితా విడుదల సందర్భంగా విజయ్ భావోద్వేగంతో మాట్లాడారు. ఈ సందర్భంగా అత్యంత కీలకమైనదిగా అభివర్ణించారు. ప్రజల నిజమైన సంరక్షకులను పరిచయం చేస్తోన్నానంటూ అభ్యర్థుల గురించి వివరించారు. తమ అభ్యర్థులు సాధారణ నేపథ్యాల నుండి వచ్చారని, ఆస్తి- అంతస్తులు వారికి లేవని, అధికారం కోసం అర్రులు చాచే వారు కాదని విజయ్ వ్యాఖ్యానించారు.
సామాన్య ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారని భరోసా ఇచ్చారు. అవినీతిపరులైన ఇతర ఎమ్మెల్యేలా కాకుండా, నీతి- నిజాయితీతో వ్యవహరిస్తారని, ప్రజల పట్ల నిబద్ధత, బాధ్యతగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అంటే ప్రజా ప్రతినిధి మాత్రమే కాదని, అసెంబ్లీకి సంరక్షకులు, ప్రజల గొంతుక అని అన్నారు. తాను ప్రతి అభ్యర్థిని జాగ్రత్తగా పరిశీలించి ఎంపిక చేశాననని తెలిపారు. ఈ సందర్భంగా, ప్రజలకు టీవీకే, దాని ఎన్నికల గుర్తు విజిల్ కు ఓటు వేయమని విజయ్ పిలుపునిచ్చారు.
2026 சட்டமன்றத் தேர்தல், தமிழக வெற்றிக் கழகத்தின் வெற்றி வேட்பாளர்கள் அறிமுக நிகழ்ச்சி நேரலை...https://t.co/6QzBRse09Q
— TVK Party HQ (@TVKPartyHQ) March 29, 2026
తాము ప్రజల కోసమే ఇక్కడ ఉన్నామని, గెలిచిన తర్వాత, ఎప్పటికీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయబోమని తేల్చి చెప్పారు. అవినీతికి పాల్పడమని హామీ ఇచ్చారు. అలాగే మహిళల భద్రతను కాపాడతామని, మాదకద్రవ్యాలు లేని తమిళనాడును సృష్టిస్తామని విజయ్ అన్నారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర, ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా మేము ఎప్పటికీ వ్యవహరించమని చెప్పారు. ఇది నా వాగ్దానం.. అని విజయ్ భావోద్వేగంగా చెప్పారు. తమిళనాడు సంక్షేమం కోసం టీవీకేకు ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నానని అన్నారు.
-
తెరపై స్టార్ హీరో + దర్శకుడు: విజయ్ వద్దనుకున్న చోట.. -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications