వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయకాంత్ సస్పెన్స్: కార్యకర్తల్ని కొట్టడంపై..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: 2014 సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారనే విషయమై డిఎండికె వ్యవస్థాపక అధ్యక్షులు విజయకాంత్ సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం డిఎంకెతో పొత్తు కోసం భారతీయ జనతా పార్టీ తొలుత చూసింది. ఆ పార్టీ బిజెపితో కలిసి వెళ్లేందుకు మొగ్గు చూపలేదు.

దీంతో బిజెపి డిఎండికె వైపు చూస్తోంది. అయితే, విజయ కాంత్ మాత్రం పొత్తులపై ఏమాత్రం స్పందించడం లేదు. ఆదివారం జరిగిన పార్టీ యాంటీ కరప్షన్ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. ఏ పార్టీ పేరు చెప్పకుండా.. ఎన్నికల నేపథ్యంలో తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా నాయకులు, కార్యకర్తలు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమానికి తరలి వచ్చిన వారు 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దామని వారు నినాదాలు చేశారు. దానిపై స్పందించిన విజయకాంత్.. మీరు చెప్పినట్లు నడుచుకుంటానని అయితే, అవసరమైన సమయంలో పొత్తులపై తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు.

మరోవైపు కార్యకర్తలను తాను కొడతాననే ప్రచారంపై స్పందిస్తూ.. ఎవరైనా తప్పు చేస్తే తాను కొడతానని అయితే, అదే సమయంలో వారి పట్ల తాను చూపించే ప్రేమ అలాగే ఉంటుందని విజయకాంత్ చెప్పారు.

జయలలితతో కలిసి..

జయలలితతో కలిసి..

విజయకాంత్ ఆధ్వర్యంలోని డిఎండికె పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడిఎంకె పార్టీతో కలిసి పోటీ చేసింది.

ఎవరితో వెళ్తారు?

ఎవరితో వెళ్తారు?

2014 సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారనే విషయమై డిఎండికె వ్యవస్థాపక అధ్యక్షులు విజయకాంత్ సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.

విజయకాంత్

విజయకాంత్

ప్రధాన ప్రతిపక్షం డిఎంకెతో పొత్తు కోసం భారతీయ జనతా పార్టీ తొలుత చూసింది. ఆ పార్టీ బిజెపితో కలిసి వెళ్లేందుకు మొగ్గు చూపలేదు.

బిజెపి

బిజెపి

దీంతో బిజెపి డిఎండికె వైపు చూస్తోంది. అయితే, విజయ కాంత్ మాత్రం పొత్తులపై ఏమాత్రం స్పందించడం లేదు. ఆదివారం జరిగిన పార్టీ యాంటీ కరప్షన్ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు.

విజయకాంత్ సూచన

విజయకాంత్ సూచన

ఏ పార్టీ పేరు చెప్పకుండా.. ఎన్నికల నేపథ్యంలో తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా నాయకులు, కార్యకర్తలు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు.

మాట్లాడుతున్న విజయకాంత్

మాట్లాడుతున్న విజయకాంత్

ఆదివారం జరిగిన పార్టీ యాంటీ కరప్షన్ కాన్ఫరెన్సు సమావేశంలో విజయకాంత్ మాట్లాడుతుండగా కార్యకర్తలు... 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దామని నినాదాలు చేశారు.

అవసరమైతే పొత్తు

అవసరమైతే పొత్తు

దానిపై స్పందించిన విజయకాంత్.. మీరు చెప్పినట్లు నడుచుకుంటానని అయితే, అవసరమైన సమయంలో పొత్తులపై తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు.

ఎందుకు కొడతానంటే..?

ఎందుకు కొడతానంటే..?

మరోవైపు కార్యకర్తలను తాను కొడతాననే ప్రచారంపై స్పందిస్తూ.. ఎవరైనా తప్పు చేస్తే తాను కొడతానని అయితే, అదే సమయంలో వారి పట్ల తాను చూపించే ప్రేమ అలాగే ఉంటుందని విజయకాంత్ చెప్పారు.

English summary
Both the politicians and the public are eagerly waiting whether DMDK chief Vijayakanth will allign with any party in LS election or contesting alone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X