వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెన్నైలో ఆంధ్రాహోటల్‌పై దాడి: వికార్ తండ్రి ఫిర్యాదు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం ఎన్‌కౌంటర్ పైన, తెలంగాణ రాష్ట్రంలోని ఆలేరు ఎన్‌కౌంటర్ పైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శేషాచలం ఘటనకు నిరసనగా చెన్నైలోని అంబాలీ నగర్‌లో ఆంధ్రా హోటళ్ల పైన దాడి చేశారు.

మరోవైపు, ఈ రెండు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద పలువురు నిరసన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎదురు కాల్పులు బూటకమని ఢిల్లీలో ప్రజాసంఘాలు ఆరోపించాయి. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రెండు ఘటనల పైన సీబీఐతో దర్యాఫ్తు జరిపించాలన్నారు.

గంగిరెడ్డి లాంటి స్మగ్లర్లను విడిచిపెట్టి అమాయకులైన కూలీలను బూటకపు ఎన్‌కౌంటర్ పేరిట హత్య చేశారన్నారు. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా, వికారుద్దీన్ తండ్రి మహ్మద్ హైమద్ శనివారం నాడు మాట్లాడుతూ.. తన తనయుడి ఎన్‌కౌంటర్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆయన పోలీసుల పైన ఫిర్యాదు చేశాడు.

వికారుద్దీన్

వికారుద్దీన్

నల్గొండ జిల్లా సరిహద్దులో తన కుమారుడు వికారుద్దీన్‌తో పాటు మరో నలుగురిని ఎన్‌కౌంటర్ పేరిట హత్య చేసిన వరంగల్ జిల్లా జైలు ఎస్కార్ట్ సిబ్బంది, దానికి బాధ్యులైన ఉన్నతాధికారులపై హత్యానేరం కేసు నమోదు చేయాలని వికారుద్దీన్ తండ్రి మహ్మద్ హైమద్ డిమాండ్ చేశారు.

వికారుద్దీన్

వికారుద్దీన్

తన కుమారుడి ఎన్‌కౌంటర్ బూటకమని శనివారం నల్గొండ జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ రాఘవేందర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం తన న్యాయవాదులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్‌కౌంటర్ జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందని పోస్టుమార్టం నివేదిక కూడా తన కుమారుడు, అతని అనుచరులది హత్యేనని తేలిందన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పచెప్పి తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో పైకోర్టుకు వెళ్తామన్నారు.

నిరసన

నిరసన

ఈ రెండు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద పలువురు నిరసన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎదురు కాల్పులు బూటకమని ఢిల్లీలో ప్రజాసంఘాలు ఆరోపించాయి.

నిరసన

నిరసన

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రెండు ఘటనల పైన సీబీఐతో దర్యాఫ్తు జరిపించాలన్నారు.

English summary
Vikaruddin's father lodges complaint against police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X