పురందేశ్వరి చేతుల్లో కొత్త విద్యా చట్టం.. ఒకే దేశం, ఒకే విద్యా కమిషన్!

భారత ఉన్నత విద్యా రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ (VBSA) బిల్లు-2025'ను తీసుకురాబోతోంది. దశాబ్దాలుగా విద్యా సంస్థలను నియంత్రిస్తున్న యూజీసీ (UGC), ఏఐసీటీఈ (AICTE), ఎన్‌సీటీఈ (NCTE) వంటి సంస్థల స్థానంలో.. 'ఒకే దేశం-ఒకే నియంత్రణ సంస్థ' అనే నినాదంతో ఒకే కేంద్ర కమిషన్‌ను ఏర్పాటు చేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.

ప్రస్తుత విద్యా వ్యవస్థలో వివిధ సంస్థల మధ్య సమన్వయ లోపం, మితిమీరిన పేపర్‌వర్క్, నిబంధనల గందరగోళం వల్ల ఉన్నత విద్య కుంటుపడుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు యూజీసీ, ఏఐసీటీఈలు పూర్తి మద్దతు ప్రకటించాయి. 12 మంది సభ్యులతో కూడిన కొత్త కమిషన్ (VBSA) ఏర్పాటు కావడం వల్ల క్రెడిట్ బదిలీలు, ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు సులభతరం అవుతాయని, 2035 నాటికి విద్యార్థుల నమోదును 50 శాతానికి పెంచవచ్చని అధికారులు పార్లమెంటరీ కమిటీకి వివరించారు.

Vikasit Bharat Shiksha Adhishthan Bill 2025 UGC and AICTE Back New Single Higher Education Regulator Move

పురందేశ్వరి నేతృత్వంలో అధ్యయనం!

ప్రస్తుతం ఈ కీలక బిల్లును పార్లమెంట్ సంయుక్త కమిటీ (JPC) అధ్యయనం చేస్తోంది. దీనికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వం వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తున్న తరుణంలో, ఆయన వదిన అయిన పురందేశ్వరి ఈ బాధ్యతలు చేపట్టడం రాజకీయంగానూ ఆసక్తి కలిగిస్తోంది.

ఆందోళనలు - వివాదాలు:

అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

  • రాష్ట్రాల హక్కులు: ఉన్నత విద్యపై రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కేంద్రం లాగేసుకుంటోందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని వారు వాదిస్తున్నారు.
  • స్వయంప్రతిపత్తి: వర్సిటీల స్వయంప్రతిపత్తి తగ్గిపోయి, అన్నీ కేంద్రం చేతుల్లోకి వెళ్తాయని విమర్శిస్తున్నారు.
  • కఠిన నిబంధనలు: నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, విద్యా సంస్థలను మూసివేసే అధికారం కొత్త కమిషన్‌కు ఉండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ బిల్లుపై ఎప్పుడు, ఎన్నిసార్లు చర్చలు జరిపారనే విషయంలో స్పష్టత లేకపోవడంతో వివాదం ముదురుతోంది. ఒకవైపు సంస్కరణలు కావాలన్న వాదన, మరోవైపు రాష్ట్రాల హక్కుల రక్షణ కోసం పోరాటం.. ఈ రెండింటి మధ్య 'వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు' ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+