ఎన్నికల కోడ్ ఉల్లంఘన .. ఆధారాలతో అడ్డంగా బుక్ అయిన ప్రకాష్ రాజ్
Recommended Video

బెంగళూరు సెంట్రల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. ప్రకాష్ రాజ్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆయన పైన అందిన ఫిర్యాదుతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్ లో ప్రకాశ్ రాజ్ పై కేసు నమోదయింది.
మార్చి 12వ తేదీన బెంగళూరు మహాత్మా గాంధీ సర్కిల్ దగ్గర అనుమతి లేకుండా మైక్ వినియోగిస్తూ రాజకీయ ప్రచారం చేశారని, తనకు ఓటు వేయాల్సిందిగా అందరిని విజ్ఞప్తి చేశారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు కొందరు స్థానికులు. మీడియా మరియు ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ బ్యానర్ కింద నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ అది రాజకీయపరమైన ర్యాలీ కానప్పటికీ ఆ ర్యాలీలో అనుమతి లేకుండా కాన్వాసింగ్ నిర్వహించారు. చాలామంది రచయితలు, ఉద్యమకారులు, కళాకారులు పాల్గొన్న ఆ ర్యాలీలో తనకు ఓటు వేయాల్సిందిగా ప్రకాష్ రాజ్ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు.

ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్న వీడియోను తీసిన కొందరు ఆ వీడియోను ఎన్నికల అధికారులకు వాట్సాప్ ద్వారా పంపించారు. ఆ వీడియోలు చూసిన ఎన్నికల అధికారులు అక్కడకు వెళ్లేసరికి కార్యక్రమం పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన ప్రకాశ్ రాజ్ పై వాట్సాప్ లో వచ్చిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు.
మీడియా మరియు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పైన ప్రవీణ్ మరియు అభిలాష్ అనే ఇద్దరు ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నప్పటికీ ఆ ర్యాలీలో ప్రకాష్ రాజ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కాబట్టి ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు ర్యాలీ నిర్వహించిన ప్రవీణ్ మరియు అభిలాష్ ల పైన , ర్యాలీలో రాజకీయ ప్రచారం నిర్వహించిన ప్రకాష్ రాజ్ పైన కేసులు నమోదయ్యాయి. మొత్తానికి ప్రకాష్ రాజ్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి ఎన్నికల అధికారుల చేతుల్లో అడ్డంగా బుక్కయ్యాడు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications