Viral: ఎర్రచీర కట్టుకుని, బంగారు నగలు వేసుకుని ?, ప్రభుత్వం పరువు తీసిన కొత్తపెళ్లికూతురు, వీడియో!

తిరువనంతపురం/కేరళ: పెళ్లి చేసుకునే సందర్బంలో పెళ్లికూతురు, పెళ్లి కొడుకు ఫోటో షూట్ లు, వీడియోలు తీసుకోవడం సర్వసాధారణం. కొందరు లక్షలు ఖర్చు చేసి సుందరమైన ప్రాంతాలకు వెళ్లి వెడ్డింగ్ ఫోటో షూట్ లో సందడి చెయ్యడం మనం చాలానే చూశాము. కొందరు వాళ్ల స్థోమతను బట్టి ఖర్చు చేసి వెడ్డింగ్ ఫోటో షూట్ లో పాల్గొంటారు.

అయితే ఓ అందమైన అమ్మాయి ఆమె పెళ్లి రోజు ఎర్రచీర కట్టుకుని, నగలు వేసుకుని గుంతలు పడిన రోడ్డు మీదకు వచ్చింది. నడిరోడ్డులో విపరీతంగా గుంతలు పడటం, వర్షం నీరు అక్కడ చేరిపోవడంతో అదే చోట నడుచుకుంటూ వెళ్లిన పెళ్లి కూతురు ఫోటో షూట్ లో పాల్గొనింది. గుంతల రోడ్డు మీద పెళ్లి కూతురు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. పెళ్లికూతురి దెబ్బతో ఆ రాష్ట్రం పరువు గంగపాలైయ్యింది.

కొత్త పెళ్లికూతురు

కొత్త పెళ్లికూతురు

కేరళలో ఓ యువతి పెళ్లి రోజు ఫోటో తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. కల్యాణమండపం దగ్గర కాకుండా మరో ప్రాంతంలో ఫోటోలు తీసుకుంటానని పెళ్లి కూతురు ఫోటోగ్రాఫర్ కు చెప్పింది. పెళ్లికూతురు ఫోటోలు బాగా తియ్యాలని ఫోటోగ్రాఫర్లు సిద్దం అయ్యారు. పెళ్లికూతురు ఇంట్లో అందంగా రెడీ అయ్యింది.

ఎర్రచీర..... బంగారు నగలు వేసుకుని?

ఎర్రచీర..... బంగారు నగలు వేసుకుని?

ఎర్రచీర కట్టుకుని, నగలు వేసుకుని గుంతలు పడిన రోడ్డు మీదకు వచ్చింది. నడిరోడ్డులో విపరీతంగా గుంతలు పడటం, వర్షం నీరు ఆ గుంతల్లో చేరిపోవడంతో ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లిన పెళ్లి కూతురు ఫోటో షూట్ లో పాల్గొనింది. గుంతలు పడిన రోడ్డు మీద పెళ్లి కూతురు నడుచుకుంటూ వెలుతున్న సమయంలో ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీశారు.

సోషల్ మీడియాలో వైరల్.... 43 లక్షల మంది. 3.7 లక్షల లైక్ లు

పెళ్లికూతురు గుంతల రోడ్డు మీద తీసిన ఫోటోషూట్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇన్ స్టగ్రామ్ లో 43 లక్ష్లల మంది ఆ ఫోటోలు చూశారు. 3.7 లక్షల మంది ఆఫోటోలు, వీడియోలను లైక్ చేశారు. ఇదే సమయంలో కేరళ ప్రభుత్వం పనితీరుపై నెటిజన్లు మండిపడ్డారు.

కేరళ ప్రభుతం పరువు గంగపాలైయ్యింది

కేరళ ప్రభుతం పరువు గంగపాలైయ్యింది

పెళ్లికూతురు ఆమె ఉంటున్న ప్రాంతంలోని సమస్యల గురించి ప్రభుత్వ పెద్దలకు తెలిసేలా ఇలా ఫోటో షూట్ లో పాల్గొనడంతో అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు. కేరళ ప్రభుత్వం చాలాబాగా నిద్రపోతుందని కొందరు, కేరళలో ప్రభుత్వం ఉందా ?, లేదా ? అని కొందరు ఇలా కేరళ ప్రభుత్వం మీదమండిపడుతున్నారు.

చేపలు పెంచుకుంటే లాభాలు వస్తాయి

చేపలు పెంచుకుంటే లాభాలు వస్తాయి

కొందరు అయితే రోడ్ల మీద పడిన గుంతల్లో హ్యాపీగా చేపలు పెంచుకోవచ్చని, మంచి లాభాలు కూడా వస్తాయని కొందరు కామెంట్లు చేశారు. మొత్తం మీద కొత్తపెళ్లికూతురు దెబ్బతో ఆ రోడ్లు బాగుపడుతాయని కొందరు కామెంట్లు చేశారు. కొత్త పెళ్లికూతురు ప్రభుత్వ పెద్దల కళ్లు తెరిపించిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+