వ్యూస్ పిచ్చి కోసం శోభనం వీడియోనా?: ఫస్ట్ నైట్ వీడియో నెట్టింట వైరల్... నెటిజన్లు ఫైర్!
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ నుంచి సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిన ఓ వీడియో తీవ్ర వివాదానికి దారితీసింది. కొత్తగా పెళ్లయిన ఓ మహిళ తన శోభనం గురించిన అత్యంత వ్యక్తిగత విషయాలను అసభ్యకరమైన సైగలతో వివరిస్తూ మాట్లాడిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ పరిమితులు, వ్యక్తిగత గోప్యత, సామాజిక నైతికతపై ఈ ఉదంతం పెద్ద ఎత్తున చర్చను రేకెత్తించింది.
ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షమైన కేవలం 18 గంటల్లోనే దాదాపు 11 కోట్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. దాంతో పాటు ఆ క్రియేటర్ ఖాతాలోని ఫాలోవర్ల సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగింది. అయితే ఈ రకమైన కంటెంట్‌పై ఆన్‌లైన్ నెటిజన్లు, వివిధ పర్యవేక్షణ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కంటెంట్ పరిధి దాటి తీవ్ర అసభ్యకరంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వీడియోను చిత్రీకరించిన విధానంపై కూడా పలు అనుమానులు వ్యక్తమవుతున్నాయి. ఆ మహళను ఆమె భర్త కెమెరాతో చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైనట్లు.. అలాగే వద్దని వారిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని వీక్షకులు ఎత్తిచూపుతున్నారు. లైక్స్, వ్యూస్, సోషల్ మీడియా క్రేజ్ కోసం కనీస వ్యక్తిగత గౌరవ మర్యాదలను కూడా పక్కనపెట్టి ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారనడానికి ఈ సంఘటనే ఉదాహరణ అని విమర్శకులు మండిపడుతున్నారు.
సాధారణ సోషల్ మీడియా ఫీడ్స్ ద్వారా ఇలాంటి అసభ్యకర కంటెంట్ మైనర్లకు అందుబాటులోకి రావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా వివాహ బంధంలోని వ్యక్తిగత దృశ్యాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం వల్ల ఎదురయ్యే ముప్పుల గురించి ఛత్తీస్‌గఢ్ మహిళా కమిషన్ వంటి ప్రభుత్వ సంస్థలు ఇదివరకే పలుమార్లు హెచ్చరించాయి. భవిష్యత్తులో దాంపత్య బంధంలో ఎలాంటి చట్టపరమైన లేదా వ్యక్తిగత సమస్యలు ఎదురైనా.. ఇటువంటి డిజిటల్ ఆధారాలు మహిళల జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని స్పష్టం చేస్తున్నాయి.
18 घंटे में 11 करोड़+ व्यूज! 😳 लेकिन वायरल होने की कीमत क्या है?
— Jamwant Maurya (@JamwantM) August 28, 2026
रायपुर की एक नवविवाहिता का वीडियो सोशल मीडिया पर तेजी से वायरल होने का दावा किया जा रहा है। कहा जा रहा है कि महज 18 घंटे में वीडियो को 11 करोड़ से ज्यादा बार देखा गया और लाखों नए फॉलोअर्स जुड़ गए।
लेकिन सवाल यह… pic.twitter.com/GT6q7VFiiW














Click it and Unblock the Notifications