ప్రధాని మోదీతో ప్రకాశ్ రాజ్.. పోస్టు వైరల్
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్ చేశారు. తాను ప్రధాని మోదీని కలిసినట్టు తెలిపారు. అందుకు సంబంధించిన ఫోటోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అది కాస్తా క్షణాల్లో వైరల్ అయింది. ఎప్పుడూ ప్రధాని మోదీ, కేంద్రంపై విరుచుకుపడే ప్రకాశ్ రాజ్.. ప్రధాని మోదీని కలవడానికి గల కారణం ఏంటని సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ ప్రధాని మోదీపై ప్రకాశ్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Met him at the airport.. but couldn’t have a conversation… #justasking pic.twitter.com/YgtxKxKVEy
— Prakash Raj (@prakashraaj) September 21, 2025
ప్రధాని మోదీని ఎయిర్ పోర్టులో కలిశానని.. అయితే తమ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని నటుడు ప్రకాశ్ రాజ్ పోస్టు చేశారు. ఈ పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక ప్రకాశ్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ తో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ప్రశ్నిస్తుంటారు. ఇక తాజాగా ఆదివారం ప్రధాని మోదీతో తాను దిగిన ఫొటోకు కూడా ప్రకాశ్ రాజ్ "జస్ట్ ఆస్కింగ్" అన్న హ్యాష్ ట్యాగ్ ను తగిలించేశారు ప్రకాశ్ రాజ్.

అయితే ఈ ఫోటోను నిశితంగా గమనిస్తే.. ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ మాదిరి ఉంది. నిజంగా మోదీ కాదు. కానీ ప్రకాశ్ రాజ్ ఇలా పోస్టు చేయడంపై పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. కరెన్సీ నోట్ల ఫోటో పెట్టి.. నేను కూడా గాంధీజీని రోజూ కలుస్తా అని ఓ నెటిజెన్ కామెంట్ చేశారు. ఈ కటౌట్ చాలా రియల్ గా ఉందని గ్రోక్ కూడా దీన్ని గుర్తించలేదని మరొకరు కామెంట్ పెట్టారు. మరొకరు కామెంట్ లో .. ఎప్పుడు విమర్శించే మోదీ గారిని మీరు కలవడం.. పవన్ కళ్యాణ్ ప్రతి రాజకీయ చర్యను విమర్శించే మీరు OG లో చేయడం ఏమా కథ అని పోస్టు చేశారు.
-
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా?












Click it and Unblock the Notifications