Viral video : డ‌్రై ఫ్రూట్స్‌తో అలంకరణ..మీరూ సూపర్ మేడం..(వీడియో)
ఎక్స్‌లో వైరల్ అయ్యింది అంటే అది ఏ వీడియో అయినా, అందులో ఉన్నవాళ్లు సెలబ్రిటీలుగా మారిపోతారు. తాజాగా ఓ మహిళ తన సీమంతం ఫంక్షన్‌లో డ్రైఫ్రూట్స్‌తో ముస్తాబయి అందరి చూపును తన వైపు తిప్పుకుంది. ఆ వీడియో విశేషాలేంటో తెలుసుకుందాం.
అలంకరణకు, ఆడవారికి ఉన్న అవినాభావా సంబంధం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో మహిళల అలంకరణకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొందరు మహిళలు వినూత్న రీతిలో అలంకరించుకుంటూ గుర్తింపు పొందుతుంటారు. ఇప్పుడు తాజాగా, ఎక్స్‌లో అలాంటి వీడియోనే వైరల్‌గా మారింది. ఆ మహిళ ఇన్నోవేటివ్ ఆలోచనకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఆకర్షణతో ఆలోచించేలా చేసింది..:
సాధారణంగా గర్భిణీగా ఉన్నప్పడు మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలి అంటారు వైద్యులు. అందులో ముఖ్యంగా బాదం, జీడిపప్పు, పిస్తా లాంటి డ్రైప్రూట్స్ తప్పనిసరి అని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఆ సూచనలనే తన ఆలోచనలకు జోడిస్తూ ఓ మహిళ తన సీమంతంలో అందరిని ఆకర్షించింది. పట్టుచీరతో ఒంటినిండా ఆభరణాలు వేసుకుని బంధుమిత్రుల మధ్య తళుక్కుమంది. ఇందులో వింతేముంది? అనుకుంటున్నారా..అక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చింది ఆ మహిళ. డ్రై ఫ్రూట్స్‌తో ప్రత్యేకంగా తయారు చేసిన హారాలు, గాజులు, వడ్డానంతోపాటు నక్లెస్, గాజులు, చెవిపోగులు, హెయిర్ బ్యాండ్, వడ్డాణం వంటి ఆభరణాల స్టయిల్‌లో అందరి చూపు తన వైపు తిప్పుకునేలా చేసింది. కాదు కాదు..తన సీమంతం ఫంక్షన్ అందరికి గుర్తుండిపోయేలా చేసింది. ఎంతలా అంటే ఆ వీడియో ఎక్స్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే కోటిమంది వీక్షించేంతలా... ఈ డ్రై ఫ్రూట్స్ గర్భీణీలుగా ఉన్నప్పుడు తీసుకోవడం వలన ఎంత మేలు జరుగుతుందో తెలిసేలా చేసింది. అలంకరణ అంటే కేవలం ఆకర్షించడానికే కాదు. ఆలోచించేలా చేయడానికి అని నిరూపించారు మీకు హాట్యాఫ్ చెప్పాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరెందుకాలస్యం నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరు చూసేయండి.












Click it and Unblock the Notifications