వీడియో: బాలాకోట్ దాడులు ఇవేనంటూ వైరల్.. అసలు విషయం వేరే: అక్కడి నుంచి ఎత్తుకొచ్చారు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ లోని ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రావిన్స్ బాలాకోట్ పట్టణం సమీపంలో జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అతి పెద్ద శిక్షణ శిబిరాన్ని మంగళవారం తెల్లవారు జామున నేలమట్టం చేసింది భారత వైమానిక దళం. ఈ దాడులు పూర్తయిన కొన్ని గంటల వ్యవధిలో ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తెగ హల్ చల్ చేస్తోంది. వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్లలో భలేగా సర్క్యులేట్ అవుతోందా వీడియో. ఈ వీడియోకు తమ దేశభక్తిని జోడించి, క్యాప్షన్లను అతికించి మరీ షేర్లు చేస్తున్నారు కొందరు నెటిజన్లు. దీనికి సర్జికల్ స్ట్రైక్ 2, బాలాకోట్, ఇండియా స్ట్రైక్ బ్యాక్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ ముర్దాబాద్ అనే హ్యాష్ ట్యాగ్ లను జత చేస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే దీన్ని 18 వేల మంది తిలకించారు. భారీగా షేర్ చేశారు. లైక్స్ కు లెక్కే లేదు. నిజానికి- ఇది నకిలీ వీడియో. ఈ వీడియోకు, బాలాకోట్ దాడులకు ఎలాంటి సంబంధమూ లేదు. ఓ వీడియో గేమ్ నుంచి దీన్ని ఎత్తుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆ వీడియో గేమ్ పేరు అర్మా 2.
#Surgicalstrike2 #Balakot #IndiaStrikesBack #IndianAirForce New Video of Attack 😡 See this Pakistan Murdabad pic.twitter.com/LIbzBBWAhS
— MRITYUNJAY DWIVEDI (@MRITYUNJAYDWIV9) February 26, 2019
అమెరికాకు చెందిన మెరికల్లాంటి సైనికులు ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల స్థావరాలను ధ్వంసం చేసిన సందర్బాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన వీడియో గేమ్ అట ఇది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను 2015 జులై 9వ తేదీన యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. 20 లక్షల హిట్స్ దీనికి వచ్చాయి. అదే వీడియో ఇప్పుడు మరోసారి సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications