viral video:శభాష్ డాక్టర్స్.. వానరానికి వైద్యం.. తల్లి ఒడిలో చిన్న కోతి.. వైరల్
జబ్బు చేస్తే అల్లాడుతాం.. మందులు లేదంటే ఇంజెక్షన్ వేసుకుంటాం. సీరియస్‌గా ఉంటే ఆస్పత్రికి వెళ్లడం తప్పనిసరి.. ఇదీ జనానికి అలవాటే.. మరీ మూగజీవాల పరిస్థితి.. వాటిని పట్టించుకునే వారే ఉండరు. ఎవరైనా పెంచుకుంటున్న కుక్క, పిల్లికి అయితే వైద్యం అందుతుంది.. మరీ మిగతా పశు, పక్ష్యాదుల సంగతి ఏంటనే విషయం అర్థం కాలేదు. ముఖ్యంగా కోతుల సంగతి ఏంటీ..? అవీ కరుస్తాయని జనం దగ్గరకు కూడా రానీయరు.. అవును వాటిని దూరం కొడతారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఓ వానరం.. తన బిడ్డకు బాగోలేకుంటే తల్లడిల్లింది. ఆ వీడియో మీరు చూడండి.

బిడ్డను తీసుకొని వచ్చిన కోతి..
ఈ ఘటన బీహార్‌లో జరిగింది. కానీ ఓ వానరం తన బిడ్డను తీసుకొని డాక్టర్ వద్దకు వచ్చింది. బిడ్డకు బాగోలేదని వారికి సైగ చేసిందో.. ఏమో.. ఇంకేముంది వైద్యులు పరీక్షించడం ప్రారంభించారు. తల్లి కోతి.. రోగులు కూర్చొనే కూర్చీమీద ఉంది. ఇద్దరు వైద్యుల బృందం ఆ చిన్ని కోతిని పరీక్ష చేసింది. ఏం జరిగిందో ఆరా తీశారు. అనారోగ్యంగా ఉండటంతో.. స్టెత్ పట్టుకొని మరీ పరీక్షించారు. జబ్బు చేసిందా అంటూ దానికి సైగ చేస్తూ అడిగారు.
వానరానికి వైద్యం..
చికిత్స చేసే సమయంలో వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది నెటిజన్లు ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. వావ్.. చిన్న కోతికి జబ్బు చేసిందా అని అడిగారు. వైద్యులు సూపర్.. మూగ జీవాలకు కూడా ట్రీట్ చేస్తున్నారని మరొకరు స్పందించారు. ఆ కోతికి వైద్యం చేసిన వైద్యులకు వందనం అంటూ మరొకరు స్పందించారు. సాటి మనుషుల మాదిరిగానే.. కోతులపై కూడా వైద్యులు కరుణ చూపారని పేర్కొన్నారు.

శభాష్.. డాక్టర్స్
వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. తెగ లైకులు కొడుతున్నారు. చూసినవారంతా షేర్ చేస్తున్నారు. వావ్.. ఇలా చేసిన వైద్యులను అభినందించారు. మిగతా వారికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. అవును మూగజీవాలపై కరుణ చూపి.. వైద్యం చేయడం రేర్.. చాలా మంది భయపడుతుంటారు. కానీ వీరు మాత్రం ధైర్యం చేశారు. ఆ వానరం తమపై దాడి చేస్తుందో లేదోనని అనుకోలేదు. చక్కగా.. చికిత్స చేశారు. ఆ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications