Viral Video:కర్నాటక ఎన్నికల వేళ ప్రధాని మోదీ షేర్ చేసిన ఈ వీడియో వైరల్..!
బెంగళూరు: సాధారణంగా ఒక మంచి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయితే దాన్ని షేర్ చేసేందుకు ప్రముఖులు లేదా సెలబ్రిటీలు వెనుకాడరు. వారు షేర్ చేసిన వెంటనే ఆ వీడియోకు మరింత వాల్యూ పెరుగుతుంది అదే సమయంలో గుర్తింపు దక్కుతుంది. ఇలాంటి మంచి వీడియోలను షేర్ చేసే ప్రముఖుల్లో ముందువరసలో ఉంటారు మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర. తాజాగా ఈ జాబితాలో ప్రధాని మోదీ చేరిపోయారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఓ వీడియోను షేర్ చేశారు. కర్నాటకకు చెందిన షల్మాలీ అనే ఓ చిన్నారి పియానో వాయించే వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ మహిళ కన్నడలో పాట పాడుతుండగా ఈ చిన్నారి ఇందుకు తగ్గట్టుగా పియానో ప్లే చేస్తోంది. అయితే ఈ షల్మాలీ టాలెంట్‌కు ఇంటర్నెట్ ఫిదా అవుతోంది. అందులో ప్రధాని మోదీ షేర్ చేయడంతో ఈ వీడియోకు మరిన్ని లైక్స్ షేర్స్ వస్తున్నాయి.

This video can bring a smile on everyone’s face. Exceptional talent and creativity. Best wishes to Shalmalee! https://t.co/KvxJPJepQ4
— Narendra Modi (@narendramodi) April 25, 2023
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు కాగానే ఆ వెంటనే ప్రధాని మోదీ షేర్ చేయడంతో ఐదు లక్షల రెట్లు ఎక్కువగా వ్యూస్ వచ్చాయి.అంతేకాదు ప్రధాని షేర్ చేయడంతో చాలా లైక్స్ కామెంట్స్ వచ్చాయి. ఈ చిన్నారి టాలెంట్‌ను కొందరు మెచ్చుకోగా.. మరికొందరు ఈ బిడ్డను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులంటూ పోస్టు చేశారు. ఇంకొందరైతే ఈ చిన్నారికి కచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందేనంటూ రాసుకొచ్చారు. ఈ చిన్నారి చిరునవ్వు ఎంతో క్యూట్‌గా ఉండటంతో పాటు మనసును హత్తుకుంటోందంటూ మరికొందరు ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications