పిల్లాడు పబ్లిక్ లో ఇలా చేస్తుంటే తల్లి తండ్రులు ఎం చేస్తున్నట్టు..!
బెంగళూరులో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ కారు సన్‌రూఫ్ నుంచి బయటికి వచ్చిన పిల్లవాడిని ట్రాఫిక్ బారియర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడి తలకు తీవ్ర గాయమైంది. అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది ఇంకా తెలియరావట్లేదు గానీ.. ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. సోషల్ మీడియాలో డిబేట్ కు దారి తీసింది.
కారు సన్ రూఫ్ నుంచి పిల్లాడు తల బయటికి పెట్టిన విషయాన్ని పట్టించుకోకుండా ట్రాఫిక్ బారియర్ గుండా వేగంగా వెళ్లడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. బ్యాడ్ పేరెంటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.

ఈ సంఘటన బెంగళూరులోని విద్యారణ్యపురలో జరిగిందని తెలుస్తోంది. కారు వేగంగా వెళుతుండగా, సన్‌రూఫ్ నుంచి బయటికి వచ్చిన పిల్లవాడు అనుకోకుండా ట్రాఫిక్ బారియర్‌ను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బిజీగా ఉన్న స్ట్రీట్ లో ఓ ఎరుపు రంగు SUV కారు వెళుతోండటం, రెడ్ టీషర్ట్ ధరించిన ఓ పిల్లవాడు సన్‌రూఫ్ నుంచి బయటికి వచ్చి నిలబడి ఉన్న దృశ్యం ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయింది.
కారు వెళ్తోన్నప్పుడు ఆ పిల్లవాడు సన్‌రూఫ్ నుంచి సరదాగా బయటికి చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో.. అకస్మాత్తుగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ట్రాఫిక్ బారియర్ గుండా కారు వేగంగా వెళ్తోన్న సమయంలో అది అతడి తలను బలంగా తాకింది. వెంటనే తల వెనక్కి వెళ్లడం, శరీరం సన్ రూఫ్ నుంచి కారులోకి జారిపోవడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ సంఘటన తర్వాత కారు ఆగిపోవడం కనిపించింది.
Next time when you leave your kids popping their heads out, think once again! pic.twitter.com/aiuHQ62XN1
— ThirdEye (@3rdEyeDude) September 7, 2025
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు షాక్ ను వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కారు సన్‌రూఫ్ నుంచి పిల్లలను బయటికి రానీయవద్దని, ఇది వారికి ప్రాణాపాయమని సూచిస్తోన్నారు. పిల్లల జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని, తమ ఆనందం కోసం వారిని ప్రమాదంలో పడేయకండి అని చెబుతున్నారు. పిల్లాడు సన్ రూఫ్ నుంచి బయటికొచ్చినప్పుడు బారియర్‌ను చూడకుండా డ్రైవ్ చేయడం సరికాదని అంటున్నారు.












Click it and Unblock the Notifications