స్విగ్గి డెలివరీ బాయ్ చేతివాటం: షూ ఇలా ఎత్తుకెళ్లాడు (వీడియో)

ఓ డెలివరీ బాయ్ తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. కస్టమర్ ఇంటి ముందున్న షూ కొట్టేశాడు ఓ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ డెలివరీ బాయ్. ఇందుకు సంబంధించి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఓ కస్టమర్ ఆర్డర్ చేసిన కిరాణా ప్యాకేజీతో ఇంటి వద్దకు వెళ్లాడు. డోర్ దగ్గర ఉన్న షూలను పరిశీలనగా చూస్తూ నిల్చున్నాడు.

ఈ క్రమంలో తలుపు తెరిచిన ఓ మహిళ ఆర్డర్ వచ్చిన ప్యాకేజీ తీసుకుని లోపలికి వెళ్లింది. అయితే, అతడు కొంతసేపు ఫోన్ చూస్తున్నట్టుగా అక్కడే తచ్చాడుతూ మెట్లు దిగాడు. తలకు కట్టుకున్న వస్త్రం తీసి ముఖాన్ని తుడుచుకుంటున్నట్లుగా నటిస్తూ ముందుకు వెళ్లాడు. అక్కడ ఎవరూ లేరని నిర్ధారణకు వచ్చిన అనంతరం మెల్లిగా తలుపు దగ్గరికి వెళ్లి ఫ్లాట్ వెలుపల ఉన్న మూడు జటల షూలలో ఒకదాన్ని తీసుకుని వాటిని గుడ్డతో కప్పుకుని పారిపోయాడు. ఈ ఘటన గుర్గావ్‌లో చోటు చేసుకుంది.

Viral video swiggy agent stealing shoes outside flat in gurgaon

అయితే, ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియోను బాధితుడి స్నేహితుడు గురువారం ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు. స్విగ్గీ డ్రాప్ అండ్ పికప్ సర్వీస్ అంటూ కామెంట్ పెట్టారు. ఒక డెలివరీ బాయ్ తన స్నేహితుడి షూ దొంగిలించాడని, కంపెనీ అతడి వివరాలను తమకు తెలియజేయట్లేదని ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. దీంతో స్విగ్గీ కూడా కస్టమర్ కు క్షమాపణలు కోరింది.

మా డెలివరీ ఏజెంట్ల నుంచి మెరుగైన సేవలనే కోరుకుంటున్నాం. మమ్మల్ని డీఎంలో సంప్రదించండి. మేము మీకు తప్పక సహాయపడతాం అంటూ స్విగ్గీ పేర్కొంది. వైరల్ వీడియోపై నెటిజన్ల వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కస్టమర్ లు కూడా జాగ్రత్తగా ఉండాలని కొందరు వ్యాఖ్యానించారు. ఇలాంటి డెలివరీ బాయ్స్ పై సదరు సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+