వైరల్ వీడియో: ఆడదానివేనా నువ్వు.. ఏంటీ పని..!
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం నేరం అని వింటుంటాం. ఇక బస్సులు, ట్రైన్స్, విమాన ప్రయాణాల్లో అయితే ఇలాంటివి నిషేధం. అలా చేస్తే భారీ జరిమానా కూడా విధిస్తారు. రద్దీ ప్రాంతాల్లో ధూమపానం తోటి వారికి ఇబ్బంది కలగడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అయితే తాజాగా ఓ యువతి ట్రైన్ లో హల్ చల్ చేసింది. రన్నింగ్ ట్రైన్ లో సిగరెట్ తాగుతూ రచ్చ రచ్చ చేసింది. ఇదేంటని ప్రశ్నించిన వారిపై శివాలెత్తింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఫైర్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
She was smoking cigarettes in an AC compartment of a running train.
— Rishi Bagree (@rishibagree) September 15, 2025
When co-travellers objected and made a video for proof, she started playing the "women's card."
pic.twitter.com/UPYmZCAi1E
రన్నింగ్ ట్రైన్ లో ఓ యువతి సిగరెట్ తాగుతూ హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తోటి ప్రయాణికులు ఆమెను అడ్డుకున్నా.. ఆమె వినకుండా వారినే దూషిస్తూ సిగరెట్ తాగింది. రైలులో స్మోకింగ్ చేయడం ప్రమాదకరమని, రూల్స్ కు విరుద్ధమని, చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. విశాఖ గాంధీదామ్ ఎక్స్‌ప్రెస్ లో ఈ ఘటన జరిగింది. రైల్లో ధూమపానం పూర్తిగా నిషేధం అని తెలిసినా ఆ యువతి ఇలా చేయడంపై నెటిజెన్లు మండిపడుతున్నారు.

వేలాది మంది నిత్యం ప్రయాణించే రైళ్లలో ఇలాంటి పనులు చేస్తే అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇదే ఘటన ఒక మగాడు చేసి ఉంటే.. రైలులో ఉన్న అందరూ కలిసి బయటకు నెట్టేసేవారని కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications