Viral video: పోలీసు బూత్ లో గ్యాంగ్ రేప్, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు, కోసి కారం పెట్టి !

అహ్మదాబాద్/ ముంబాయి/ లక్నో: పోలీసు బూత్ లోకి మహిళను లాక్కెళ్లిన ఓ కామాంధుడు ఆమెపై అత్యాచారం చేశాడు. మహిళ మూలుగులు విని అటువైపు వెళ్లిన మరో వ్యక్తి అత్యారాన్ని అడ్డుకోవడం వదిలేసి అతని స్మార్ట్ మొబైల్ ఫోన్ లో రేప్ సీన్లు వీడియో తీశాడు. తరువాత ఆ వీడియో అడ్డం పెట్టుకుని ఆమెపై వాడు అత్యాచారం చేశాడు. అంతటితో వదిలేయకుండా మొదట రేప్ జరిగిన సమయంలో తీసిన వీడియోను తీసుకెళ్లి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. ఆ పోలీసు బూత్ ను ఉపయోగిస్తున్న పోలీసులకు విషయం తెలిసి మహిళపై అత్యాచారం చేసిన కామాంధులను పట్టుకుని కోసి కారం పెట్టారు.

 ప్రధాని మోదీ సొంత రాష్ట్రం

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం

ప్రధాని నరేంద్ర మోదీ మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. గుజరాత్ లో మోర్చి పట్టణం ఉంది. మోర్చి పట్టణంలో మానవరహిత పోలీసు బూత్ లు ఉన్నాయి. ఇక్కడ కొంతకాలంగా స్థానిక పోలీసులు ఓ పోలీసు బూత్ ను ఉపయోగించకుండా వదిలేశారు.

 రాత్రి మహిళ మూలుగులు

రాత్రి మహిళ మూలుగులు

ఇటీవల ఓ రోజు హరీష్ జాదవ్ (28), అతని స్నేహితులు పోలీసు బూత్ ఉన్న ప్రాంతం వైపు వెళ్లారు. ఆ సమయంలో పోలీసు బూత్ నుంచి మహిళ మూలుగుతున్న విషయం హరీష్ జాదవ్ చెవిలో పడింది. రాత్రి వాహనాలు తక్కువ సంఖ్యలో సంచరిస్తుండటంతో హరీష్ జాదవ్ కు మహిళ మూలుగులు స్పష్టంగా వినపడ్డాయి. అదే సమయంలో హరీష్ జాదవ్ పోలీసు బూత్ దగ్గరకు వెళ్లి చూశాడు.

 సినిమా చూసినట్లు చూసి వీడియో తీశాడు

సినిమా చూసినట్లు చూసి వీడియో తీశాడు

పోలీసు బూత్ లో 28 ఏళ్ల మహిళ మీద మహేంద్ర రాథోడ్ (32) అనే వ్యక్తి అత్యాచారం చేస్తున్న విషయాన్ని హరీష్ జాదవ్ గుర్తించాడు. మహిళ తనను కాపాడాలని చెప్పినా ఆ మాట వినకుండా వెంటనే హరీష్ జాదవ్ జోబులో ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకుని రేప్ సీన్ ను వీడియో తీశాడు. వీడియోలో ఆ మహిళ కాపాడండి అంటూ కేకలు వేస్తున్న విషయం స్పష్టంగా వినపడినా హరీష జాదవ్ మాత్రం వీడియో తియ్యడంలోనే బిజీ అయిపోయాడు. మహిళ మీద అత్యాచారం చేసి కామం తీర్చుకున్న మహేంద్ర రాథోడ్ అక్కడి నుంచి హరీష్ జాదవ్ కళ్లముందే దర్జాగా చేతులు ఊపుకుంటూ వెళ్లిపోయాడు.

 వీడియో అడ్డం పెట్టుకుని రేప్ చేసిన జాదవ్

వీడియో అడ్డం పెట్టుకుని రేప్ చేసిన జాదవ్

మహేంద్ర రాథోడ్ అత్యాచారం చేస్తున్న సమయంలో తీసిన వీడియో చూపించి ఆ మహిళ పోలీసు బూత్ నుంచి బయటకు రాకుండా చేసిన హరీష్ రాథోడ్ ఆమెపై అతను అత్యాచారం చేశాడు. కామం తీరిపోయిన తరువాత హరీష్ జాదవ్ మహిళను అదే పోలీసు బూత్ లో వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితురాలు నిస్సహాయంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

 సోషల్ మీడియాలో వీడియో వైరల్

సోషల్ మీడియాలో వీడియో వైరల్

మహిళ మీద అత్యాచారం చెయ్యడమే కాకుండా అంతకు ముందు ఆమెపై మహేంద్ర రాథోడ్ అత్యాచారం చేసే సమయంలో తీసిన వీడియోను హరీష్ జాదవ్ సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. రేప్ చేసింది పోలీసు బూత్ అని వీడియోలో స్పష్టంగా కనపడింది. వీడియో వైరల్ కావడంతో ఆ విషయం ఆ పోలీసు బూత్ ఉపయోగిస్తున్న స్థానిక పోలీసులకు తెలిసిపోయింది.

 కామాంధులకు కోసి కారం పెట్టారు

కామాంధులకు కోసి కారం పెట్టారు

అత్యాచారం వీడియో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు రేప్ వీడియో ఎవరు పోస్టు చేశారు ? అంటూ ఆరా తీశారు. హరీష్ జాదవ్ రేప్ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడని వెలుగు చూడటంతో అతన్ని అదపులోకి తీసుకుని బెండ్ తీశారు. తరువాత మహిళ మీద మహేంద్ర రాథోడ్ అత్యాచారం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలో మహేంద్ర రాథోడ్ ముఖం స్పష్టంగా కనపడటంతో అతన్ని అరెస్టు చేసి బెండ్ తీశారు. భర్త మీద గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళ మీద మహేంద్ర రాథోడ్, హరీష్ జాదెవ్ అత్యాచారం చేసి ఆ వీడియో పోస్టు చేశారని పోలీసులు తెలిపారు. పోలీసు బూత్ లోనే మహిళపై ఇద్దరు గ్యాంగ్ రేప్ చెయ్యడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+