వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవును ఇది నిజం!: చివరి మజిలీలో ‘వీరభద్రుడు’?

హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్‌ వయస్సు రీత్యా 83 ఏళ్ల నేతగా ఆయన అవినీతి పరుడని ఆయన వ్యతిరేకులు చెప్తారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్‌ వయస్సు రీత్యా 83 ఏళ్ల నేతగా ఆయన అవినీతి పరుడని ఆయన వ్యతిరేకులు చెప్తారు. కానీ ఈ నెల ఏడో తేదీన మండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా ఆయన పేరును ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించేశారు. దీంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన వయస్సు రీత్యా చూసినా వచ్చేనెల తొమ్మిదో తేదీన అసెంబ్లీ ఎన్నికలే వీరభద్రుడి రాజకీయ జీవితంలో చివరి కానున్నవని విశ్లేషకులు చెప్తున్నారు.
ఇటీవలి కాలంలో వచ్చిన అవినీతి ఆరోపణలు, సీబీఐ నమోదు చేసిన కేసుల నేపథ్యంలో సీఎం అభ్యర్థిగా వీరభద్రసింగ్ పేరును ప్రకటించకముందు ఆయన వ్యతిరేకులంతా మాజీ బుషాహర్ సంస్థానం చివరి వారసుడు వీరభద్రుడి రాజకీయ జీవితం ముగిసినట్లేనని భావించారు. కానీ వీరభద్ర సింగ్ తమ సీఎం అభ్యర్థి అని మండీలో రాహుల్ ప్రకటించడంతో సీన్ మారిపోయింది.

2012 ఎన్నికల ముందు ఇలా పీసీసీ అధ్యక్షుడిగా బాద్యతలు

2012 ఎన్నికల ముందు ఇలా పీసీసీ అధ్యక్షుడిగా బాద్యతలు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ హవాకు అడ్డుకట్ట వేయడంతోపాటు ఆయన ప్రభంజనాన్నిఢీకొట్టాల్సిన బాధ్యత కూడా వీరభద్రసింగ్‌దే కావడం గమనార్హం. 'మేం ఆరు నెలలుగా అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాం. అభ్యర్థుల పేర్లు కూడా ఖరారయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మోదీ హవా లేనేలేదు' అని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వీరభద్రసింగ్ 55 ఏళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ప్రకటించకున్నా క్రియాశీల రాజకీయాల నుంచి ఆయన దాదాపు వైదొలిగినట్లేనని విశ్లేషకులు చెప్తున్నారు. 2012 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూపీఏ - 2 ప్రభుత్వంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న వీరభద్ర సింగ్‌పై అవినీతి ఆరోపణలతో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పుడే ఆయన రాజకీయ జీవితం ముగిసిందని కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యతిరేకులు, విపక్ష నాయకులు భావించారు. కానీ గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు 2012 ఆగస్టు 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం.. ఆయనను హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (హెచ్‌పీసీసీ) అధ్యక్షుడిగా నియమించింది.

కోత్కారి ఘటనతో ప్రజల్లో వెల్లువెత్తిన నిరసన

కోత్కారి ఘటనతో ప్రజల్లో వెల్లువెత్తిన నిరసన

గత ఎన్నికల్లో గెలుపొందడంతో వీరభద్ర సింగ్ వరుసగా ఎనిమిదో సారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. సిమ్లా రూరల్ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన వీరభద్ర సింగ్.. 2012 డిసెంబర్ 25వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గత కొన్ని నెలలుగా, ప్రత్యేకించి సిమ్లా జిల్లాలో కోత్కారి ప్రాంతంలో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి, హత్య చేసిన తర్వాత నిరసన వెల్లువెత్తింది. ప్రజల నిరసన హింసాత్మక రూపం దాల్చింది. ఈ క్రమంలోనే హెచ్‌పీసీసీలో పార్టీ నాయకత్వం ఆయన్ను పక్కకు తప్పించే యత్నం జరిగింది. ఈ సంగతిని గమనించినందునే సీఎం వీరభద్ర సింగ్.. గత ఆగస్టు 25వ తేదీన జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో మాట్లాడుతూ తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఎన్నికల్లో ప్రచారం చేయబోనని కుండబద్దలు కొట్టి.. ప్రత్యర్థులకు ముందరికాళ్ల బంధం వేశారు.

థియోంగ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట

థియోంగ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో సీఎం వీరభద్రసింగ్.. థియోంగ్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. దాదాపు ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు కేటాయిస్తామని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో కూడా ఖరారైందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. బడ్జెట్ నిధులు కేటాయింపులు చేయకుండానే వివిధ పథకాల పేరిట శంకుస్థాపన చేశారని వీరభద్ర సింగ్ ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలు రుజువు చేయాలని బీజేపీని సవాల్ చేశారు. తనను పోటీ చేయాలని పలు నియోజకవర్గాల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయని వీరభద్రసింగ్ చెప్పారు. ప్రస్తుతం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విద్యా స్టోక్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న థియాంగ్ స్థానం నుంచి వైదొలిగేందుకు సిద్ధమని, పోటీ చేయాలని కోరారన్నారు. థియాంగ్, ఆర్కి అసెంబ్లీ స్థానాల్లో ఏ స్థానం నుంచి పోటీ చేసినా గెలుస్తానన్నారు. విద్యాస్టాక్స్ తన భర్త లాల్ చంద్ స్టోక్స్ మరణంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.1974లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977లో జనతా పార్టీ చేతిలో ఓటమి పాలైనా ఆమె 1993లో రికార్డు స్థాయి విజయం సాధించారు. అంతకుముందు 1982, 1985, 1990, 1998 ఎన్నికల్లోనూ ఆమె అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2003, 2007 ఎన్నికల్లో థియాంగ్ నుంచి కుమార్ సైన్ ప్రాతినిధ్యం వహించారు. 1985 - 90 మధ్య స్పీకర్ గానూ పని చేసిన విద్యాస్టాక్స్ 2003 - 07, 2012 నుంచి ఇప్పటివరకు వీరభద్ర సింగ్ క్యాబినెట్‌లో సభ్యురాలుగా ఉన్నారు.

English summary
SHIMLA: With the announcement of Himachal Pradesh assembly election on November 9, chief minister Virbhadra Singh (83), the grand old man of ruling Congress in this hill state, is set for arguably his last political battle in the state. Considering his age and corruption allegations against him, his rivals within the Congress had written him off but the October 7 rally of the party at Mandi changed the scenario when vice-president Rahul Gandhi announced his name as the CM candidate for the record seventh time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X