లీకైన Vivo X90, Vivo X90 ప్రో ధరలు

ఫ్లాగ్‍షిప్ ఎక్స్90 సిరీస్‍ను ఇండియాలో విడుదల చేసేందుకు ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో సిద్ధమైంది. ఈ సిరీస్‍లో రెండు ప్రీమియమ్ 5జీ ఫోన్లు ఇండియాలో అడుగుపెట్టబోతున్నాయి. వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో ఏప్రిల్ 26న ఇండియాలో లాంచ్ కానున్నాయి. చైనాలో గతంలో ఈ సిరీస్ లో మొత్తం మూడు మొబైల్స్ విడుదలయ్యాయి. అయితే ఎక్స్90 అల్ట్రా మోడల్ ఇండియాకు రాకపోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియమ్ లెన్స్ కెమెరాలతోపాటు ఫ్లాగ్ షిప్ స్పెసిఫికేషన్లను ఈ మొబైళ్లు కలిగి ఉంటాయి. విడుదలకు ముందే వీటి ధరల లీకయ్యాయి.

వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో ధరలు
వివో ఎక్స్90 సిరీస్ వేరియంట్లు, ధరలు భారతదేశంలో ఎలా ఉంటాయనే వివరాలను టెక్ ఔట్‍లుక్ లీక్ చేసింది.

 vivo

* 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండే వివో ఎక్స్90 బేస్ వేరియంట్ ధర రూ.59,999,
* 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఉండే టాప్ వేరియంట్ ధర రూ.63,999గా నిర్ణయించారు.
* వివో ఎక్స్90 ప్రో 12జీబీ + 256 జీబీ స్టోరేజ్‍తో ఒకే వేరియంట్‍గా రాబోతోంది.
* ఇది రూ.84,999గా ఉండబోతోంది.
* గత సంవత్సరం విడుదలైన ఎక్స్ 80 సిరీస్ కంటే ఎక్స్ 90 ధరలు ఎక్కువగా ఉండబోతున్నాయి.
* వివో మాత్రం అధికారికంగా 26వ తేదీన ప్రకటించబోతోంది.
* మీడియాటెక్ డైమన్సిటీ 9200 ప్రాసెసర్‌తో కూడా ఇవి వస్తున్నాయి. 6.78 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ కర్వ్ ఎడ్జెస్ డిస్‍ప్లే ఉంటుంది.
* ఈ రెండు ఫోన్లు 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తాయి.
* వివో ఎక్స్90 ప్రోకు వైర్లెస్ చార్జింగ్‍ సపోర్టు కూడా ఉంటుంది.
* కెమెరాలు హైలైట్ గా నిలవబోతున్నాయి.
* 50 మెగాపిక్సెల్ Sony IMX989 ప్రైమరీ కెమెరాను ఎక్స్90 ప్రో కలిగివుంటుంది.
* 50 మెగాపిక్సెల్ పోట్రయిట్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు వెనుక ఉంటాయి
* వివో ఎక్స్90 ఫోన్ వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాలు, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్లు విడుదల కాబోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+