పన్నీర్ కు మూడోసారి కన్నీరే: కీలుబొమ్మా ? బలిపశువా ?

చెన్నై: చాయ్ వాలా నుంచి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగిన పన్నీర్ సెల్వం అధికార వైభవం వరసగా మూడో సారి మూణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. రెండు సార్లు అమ్మ జయలలిత కోసం పదవి త్యాగం చేసిన పన్నీర్ సెల్వం ఇప్పుడు చిన్నమ్మ కోసం మూడో సారి త్యాగం చేశారు.

వ్యక్తిగత కారణాలతో తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానని ఆదివారం పన్నీర్ సెల్వం గవర్నర్ లేఖ రాశారు. పన్నీర్ సెల్వం రాజీనామాను తాజాగా గవర్నర్ ఆమోదించారు. అయితే పన్నీర్ సెల్వం గురించి తెలిసిన వారికి ఇది షాక్ కలిగించేదో, ఆశ్చర్యం కలిగించేదో కాదు.

పన్నీర్ సెల్వం వీరవిదేయతకు వినయానికి మారుపేరుగా ముద్రపడ్డారు. 2001లో సుప్రీం కోర్టు ముఖ్యమంత్రి పదవి చేపట్టకుండా జయలలితను అడ్డుకున్నప్పుడు పన్నీర్ సెల్వం మొదటి సారి తమిళనాడు సీఎం అయ్యారు. ఆరు నెలల తరువాత పన్నీర్ సెల్వం మళ్లీ పదవిని పువ్వుల్లో పెట్టి అమ్మకు అప్పగించారు.

VK Sasikala to be next Tamil Nadu CM, Panneerselvam resigns

ఆ తర్వాత 2014లో అక్రమాస్తుల కేసులో జయలలిత బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు వెళ్లిన సమయంలో పన్నీర్ సెల్వం రెండోసారి తమిళనాడు సీఎం అయ్యారు. అది కూడా కేవలం ఏడు నెలల మురిపమే అయ్యింది. రెండు సార్లు సీఎం అయిన పన్నీర్ సెల్వం ఒక్క సారికూడా సొంత నిర్ణయం తీసుకోలేదు.

నేను సీఎం అని సొంతంగా ముద్రవేసుకోవడానికి ఆయన ప్రయత్నించలేదు. జయలలిత మరణించిన తరువాత సీఎం అయిన పన్నీర్ సెల్వం అమ్మకు అత్యంత నమ్మకస్థురాలైన షీలా బాలకృష్ణన్ తదితరుల సలహాలతో సీఎంగా స్వతంత్రంగా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

ప్రతిపక్ష నేత స్టాలిన్ మద్దతు ఉండటం, కేంద్రప్రభుత్వం అండగా నిలవడంతో పన్నీర్ సెల్వం ఈ సారి పన్నీర్ సెల్వం సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగవచ్చునని అందరూ భావించారు. అయితే శశికళ ఎత్తుల ముందు పన్నీర్ సెల్వం నిలబడలేకపోయారు.

ప్రత్యర్థులను సవాల్ చేయగల రాజకీయ చాతుర్యం లేకపోవడం, పవర్ సెంటర్ గా ఎదుగలేకపోవడంతో ఈ సారి పన్నీర్ సెల్వం రెండు నెలలకే చేతులు ఎత్తేశారు. ఈ రెండు నెలల్లో పన్నీర్ సెల్వం ప్రతిపక్షాల ప్రశంసలు సైతం పొందగలిగారు.

అసెంబ్లీ సమావేశాలు సజావుగా నిర్వహించడంలో పన్నీర్ సెల్వం విజయం సాధించారు. ఎప్పటిలాగా డీఎంకే సభ్యులు సమావేశాల్లో వాకౌట్లు చెయ్యలేదు. సభలో దూమరం లేపలేదు. పన్నీర్ సెల్వంకు బీజేపీ వ్యూహాత్మక మద్దతు ఉంది. అయితే శశికళను ఢీకొట్టే సాహసం చెయ్యకుండా పన్నీర్ సెల్వం తన పదవికి రాజీనామా చేశారని అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఆయన సన్నిహితులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+