Budget 2024:మధ్యంతర బడ్జెట్‌కు సంబంధించి వేగవంతమైన అప్‌డేట్స్, విశ్లేషణలు మీ డైలీహంట్‌లో..!
ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌నె ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్నందున దీన్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌గా పిలుస్తారు. కేవలం మూడు నెలల వరకు మాత్రమే ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం, అందునా ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో నిర్మలమ్మ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందా అని సామాన్యులు, ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు. ఇక గృహనిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తారనే అంచనా సైతం ఉంది.
నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయ్యాక దానిపై వాడీవేడీ చర్చ జరుగుతుంది. ఈ సారి ప్రతిపక్షాలు పాలకపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు అన్ని వ్యూహాలు సిద్ధం చేశాయి. అదే సమయంలో అధికారిక పక్షం కూడా ఎక్కడ తగ్గకుండా ప్రతిపక్షాల నోర్లు మూయించేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది.జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.ఈ సారి బడ్జెట్ సమావేశాలకు సమయం చాలా తక్కువగా కేటాయించడం గమనార్హం.

లోక్‌సభ ఎన్నికల తర్వాత అప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఆ సమావేశాలు రాష్ట్రపతి ముర్ము ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఇక వాడీవేడీగా సాగనున్న బడ్జెట్ సమావేశాలకు సంబంధించి పూర్తి స్థాయి కవరేజ్‌ను మీ డైలీ హంట్ పై పొందండి. ఎప్పటికప్పుడు రియల్‌లైమ్ అప్‌డేట్స్, వార్తలు, బడ్జెట్ పై విశ్లేషణలు లైవ్‌లో పొందండి .












Click it and Unblock the Notifications