Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీకృష్ణుడి కులం ఏంటీ?: గోడలపై అంతుచిక్కని రాతలు

Lord Sri Krishna: శ్రీకృష్ణ పరమాత్ముడి కులం ఏమిటనేది ఇప్పుడు దేశంలో చర్చనీయాంశమౌతోంది. సరికొత్త దుమారం రేపుతోంది. అనేక వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది. దీనిపై ఉత్తరప్రదేశ్‌లోని మథురలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, పోలీసులు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడం వరకు పరిస్థితి వెళ్లిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

శ్రీకృష్ణుడి కులం ఏంటీ?

శ్రీకృష్ణుడి కులంపై ఎన్నో ఊహాగానాలకు తెర తీసింది.. మధురానగరి. ది హిస్టరీ ఆఫ్ నందగావ్ పేరుతో మధురతో పాటు నందగావ్‌లో వాల్ పెయింట్లు విస్తృతంగా కనిపిస్తోన్నాయి. కృష్ణ భగవానుడిని జాట్ సామాజిక వర్గానికి చెందిన వాడిగా గోడలపై రాసిన రాతల్లో ప్రస్తావించారు. కువర్ సింగ్ పేరు మీద ఇవి వెలిశాయి. పక్కనే ఫోన్ నంబర్ సైతం రాశారు.

Wall inscripts in Mathura claiming Lord Krishna was a Jat have ignited protests Police files FIR

పురాణాలు ఏం చెబుతున్నాయి?

పురాణాలు, హిందూ సంప్రదాయాల ప్రకారం.. శ్రీకృష్ణుడు యాదవ సామాజిక వర్గానికి చెందిన వాడు. యదువంశీ తిలకుడు. ఇది- వాస్తవం కాదంటూ మధుర, నందగావ్‌లో వెలిసిన వాల్ పెయింట్లు చెబుతున్నాయి. కృష్ణుడు యాదవుడు కాదని, జాట్ కులానికి చెందిన వాడంటూ రాతలు రాస్తోన్నారు.

ఎవరీ కువర్ సింగ్..

కువర్ సింగ్ పేరు మీద ఇవి కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎవరీ కువర్ సింగ్ అనేది అంతుచిక్కట్లేదు. దీనిపై ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ వాల్ పెయింట్లు స్థానికులను ఆందోళనకు గురి చేశాయి. వారిలో చర్చకూ దారి తీశాయి. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూరకంగా ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఈ రాతలు రాసివుండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

సమగ్ర దర్యాప్తు..

ఈ వివాదంపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. కువర్ సింగ్ గురించి ఆరా తీయడానినికి ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేశారు. గోడలపై రాసిన ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తోన్నామని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ నిర్వాల్ తెలిపారు. ఈ నంబర్ ప్రస్తుతం పని చేయట్లేదని, ఇనాక్టివ్‌లో ఉందని అన్నారు. సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలను సేకరిస్తామని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+