షాకింగ్: కోవిడ్ పేషెంట్‌పై వార్డు బాయ్ రెండుసార్లు అత్యాచారయత్నం.. గ్వాలియర్‌లో వెలుగుచూసిన దారుణం

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న 50 ఏళ్ల మహిళా పేషెంట్‌పై ఓ వార్డు బాయ్ రెండుసార్లు అత్యాచారానికి యత్నించాడు. వార్డులో ఎవరూ లేని సమయంలో తన వద్దకు వచ్చిన వార్డు బాయ్... తనపై లైంగిక దాడికి యత్నించాడని బాధిత పేషెంట్ వెల్లడించింది. తన కుటుంబ సభ్యులు అప్రమత్తంగా వ్యవహరించడంతో వెంటనే అతను పారిపోయినట్లు తెలిపింది. అంతేకాదు,అతను పారిపోయేందుకు ఆస్పత్రి సిబ్బందే సహకరించారని ఆరోపించింది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఓ ప్రైవేట్ హోటల్లో కోవిడ్ 19 వార్డు ఏర్పాటు చేసి పేషెంట్లకు చికిత్స అందిస్తోంది. ఇటీవల కరోనా బారినపడిన 50 ఏళ్ల ఓ మహిళ ఆ కోవిడ్ 19 వార్డులో చేరింది. అదే వార్డులో పనిచేస్తున్న ఓ వార్డు బాయ్ ఆ మహిళపై కన్నేశాడు. శనివారం(ఏప్రిల్ 17),ఆదివారం(ఏప్రిల్ 18) రాత్రి సమయాల్లో కోవిడ్ వార్డుకు వెళ్లిన ఆ వార్డు బాయ్... బెడ్‌పై ఉన్న ఆ మహిళ వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. అదే సమయంలో ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.

నిందితుడి పరారీ... అరెస్ట్...

నిందితుడి పరారీ... అరెస్ట్...

ఆ మహిళా పేషెంట్ కుటుంబ సభ్యులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆ వార్డు బాయ్ వెంటనే అక్కడినుంచి పారిపోయాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడిని వివేక్ లోధిగా గుర్తించారు. వార్డులో ఎవరూ లేని సమయంలో ఆమె వద్దకు వెళ్లిన వివేక్ లోధి.. ఆమెపై రెండుసార్లు అత్యాచారానికి యత్నించినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు,ఆస్పత్రి సిబ్బందే అతను పారిపోయేందుకు సహకరించారని ఆరోపించారు.

ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే...!!

కాంపూ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నామని ఏఎస్పీ హితికా వసల్ తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. కాబట్టి ఆ కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని చెప్పారు. మహిళా కోవిడ్ పేషెంట్లపై అత్యాచార ఘటనలు గతంలోనూ వెలుగుచూసిన సంగతి తెలిసిందే. గతేడాది కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఓ కరోనా మహిళా పేషెంట్‌పై నౌఫాల్ అనే అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+