Viral Video:పిల్ల ఎలుగుబంటి మారాం, మంచులో తల్లితో తెగ అల్లరి, వైరల్
తల్లి వద్ద పిల్లలు మారాం చేస్తారు. అవును.. అన్యోన్యంగా, అప్యాయంగా ఉంటారు. అదీ మనుషులకైనా.. జంతువులకైనా వర్తిస్తోంది. మంచులో ఎలుగుబంటి, దాని పిల్ల కూడా ఉంది. పిల్ల ఎలుగుబంటి చేసే మారాన్ని మనం చూడొచ్చు. అదీ బొర్లుతూ, కొరుకుతూ తెగ అల్లరి చేస్తోంది. ముద్దు కూడా పెట్టిన విజువల్ ఆ వీడియోలో చూడొచ్చు.
ఆ పిల్లతో తల్లి కూడా చక్కగా ఆడింది. ఆర్కిటిక్ మంచు ప్రాంతంలో వీడియోను తీశారు. చుట్టూ మంచు, అందులో ఎలుగుబంట్లు ఆడుతున్నాయి. ఆ వీడియో కూడా కేవలం 9 సెకన్లు మాత్రమే ఉంది. కానీ సోషల్ మీడియాలో తెగ తిరుగుతుంది. అందులో ఆ పిల్ల ఎలుగుబంటి అల్లరిని చక్కగా చూడొచ్చు.

వీడియో ట్విట్టర్‌లో తెగ చూస్తున్నారు. ఇప్పటికే 22 లక్షల సార్లు చూశారు. లక్ష 26 వేలకు పైగా లైకులు వచ్చాయి. వేల కొద్దీ రీ ట్వీట్లు చేశారు. పిల్ల ఎలుగుబంటి ముద్దుగా ఉందని నెటిజన్లు కామెంట్ చేశారు. మంచులో ఎలుగుబంట్లు మెరిసిపోతున్నాయని అంతా అంటున్నారు. వావ్ చాలా బాగుందని కామెంట్ చేశారు.
Mommy and her cub.. 😊 pic.twitter.com/PiWBB9wmrb
— Buitengebieden (@buitengebieden) October 7, 2022
తల్లితో పిల్ల ఎలుగుబంటి చక్కగా ఆడుకుంటుందని నెటిజన్లు కామెంట్ చేశారు. ఆ వీడియో చాలా చక్కగా ఉందని రాసుకొచ్చారు. ఆ మంచులో రైడ్ చేసే కొందరు వీడియో తీసి.. పోస్ట్ చేశారు. అదీ తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోను మీరు కూడా చూసి తరించండి. మనుషులకే కాదు జంతువులకు కూడా తల్లి ప్రేమ ఉంటుంది. కొన్ని మమకారం చూపకుండా ఉంటాయి. మరికొన్నింటికీ అలా ఉండవు.












Click it and Unblock the Notifications