Viral Video: వామ్మో.. ఇదెక్కడి పెళ్లిరా బాబు.. ఈ కండిషన్స్ చూస్తే వద్దు బాబోయి అంటారు..
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన జ్ఞాపకం. అందుకే ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా వివాహం చేసుకుంటారు. వధూవరులు తమ పెళ్లికి సంబంధించిన ప్రతి ప్రత్యేక క్షణాన్ని కెమెరాలో బంధించి భవిష్యత్తులో దానిని గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొందరు పెళ్లిని వినూత్నంగా చేసుకుంటారు. ఇంలాటి ప్రత్యేకమైన వివాహ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. తాజా ఇలాంటి వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

7 మిలియన్లకు పైగా లైక్‌లు
ఓ వధువు పెళ్లి తర్వాత తన భర్త చేయాలని కోరుకునే పనుల జాబితాను సిద్ధం చేసి అందులో వరుడితో సంతకం చేయించి పెళ్లి చేసుకుంది. ప్రత్యేకమైన పద్ధతిలో ఒప్పందం చేసుకుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వధువు శాంతి, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను సాక్షులుగా ఎనిమిది కండిషన్లతో ఒప్పందం చేసుకుంది. ఈ వీడియోను ఇస్టాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోకు 1.7 మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి.ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, వధువు, వరుడు వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒప్పందంపై సంతకం చేయడం చూడవచ్చు.
కండషన్లు ఏమిటంటే..
• ఒక నెలలో ఒక పిజ్జా మాత్రమే తినాలి
• తాను వండిన ఆహారం ఎలా ఉన్నా 'అవును' బాగుంది అని చెప్పాలి.
• వధువు తప్పనిసరిగా, ప్రతిరోజూ చీర ధరించాలి
• లేట్ నైట్ పార్టీలు వెళ్లొచ్చు కానీ నాతో మాత్రమే(భార్యతో మాత్రమే)
• భర్త రోజూ జిమ్‌కి వెళ్లాలి
• ఆదివారం ఉదయం అల్పాహారం భర్తే చేయాలి
• ప్రతి పార్టీలో మంచి ఫొటోలు తీయాలి
• ప్రతి 15 రోజులకు ఓసారి షాపింగ్ కు తీసుకెళ్లాలి

ఖంగుతిన్న నెటిజన్లు..
ఈ వీడియో చూసిన మగ నెటిజన్లు అంత ఖంగుతిన్నారు. ఒక వినియోగదారు ఈ ఒప్పందం ప్రతి పెళ్లికి జరగాలన్నారు. మరొకరు అత్యుత్తమ ఒప్పందం అని చెప్పారు. ఇంకొకరు "బ్రో ఐసే కాంట్రాక్ట్ హై టు నాకు న్హీ కరుంగా షాదీ" అంటూ చమత్కరించారు.












Click it and Unblock the Notifications