VIRAL VIDEO:ఫ్రెండ్‌ను సర్ ప్రైజ్ చేసిన దోస్తులు, చీర కట్టుకొని వచ్చిన బాయ్స్
పెళ్లి అంటే జీవితంలో ముఖ్య ఘట్టం.. అందుకే అంతా హాజరవుతుంటారు. కొందరు కట్నాలు, కానుకలు ఇస్తుంటారు. ఆ గిప్ట్స్ కూడా వెరైటీలు ఉంటాయి. అయితే అమెరికాలో ఓ ఎన్ఆర్ఐ పెళ్లికి అతని స్నేహితులు సర్ ఫ్రైజ్ చేశారు. అంటే వాళ్లెదో ఖరీదైన గిప్ట్ ఇవ్వడం కాదు.. అచ్చం భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా చేశారు. మీరు కూడా ఆ వీడియో చూడండి.
అమెరికాలో పెళ్లి చేసుకుంటున్న భారత సంతతికి చెందిన స్నేహితుడిని మాములుగా సర్‌ప్రైజ్ చేయలేదు. భారతీయ మహిళల మాదిరిగా చీరకట్టుతో పెళ్లి మండపానికి వెళ్లారు. చీర కుచ్చిళ్లు పట్టుకొని వయ్యారంగా నడుస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పట్టుచీర కట్టుకొని, నుదుట బొట్టు పెట్టుకొని పెళ్లి కూతురితో కలిసి చికాగోలో గల మండపానికి వెళ్లారు. తన బెస్ట్ ఫ్రెండ్స్‌ని భారతీయ సంప్రదాయ చీరకట్టులో చూసి ఆ పెళ్లి కొడుకు నవ్వు ఆపుకోలేకపోయాడు. పెళ్లికూతురు కూడా కొంచెం సేపు నవ్వేసింది. ఆ తర్వాత పెళ్లికొడుకు వాళ్లతో కలిసి గ్రూప్ ఫొటో దిగాడు.
చికాగోకు చెందిన పారాగాన్‌ఫిల్మ్స్ అనే వెడ్డింగ్ వీడియోగ్రాఫర్స్ ఆ వీడియోను ఇన్‌స్టా పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఆ వీడియోను ఇప్పటికే 28 వేల సార్లు చూశారు. చాలా మంది లైక్ కొట్టారు. తెగ కామెంట్లు చేస్తున్నారు. వావ్.. అంటూ కొందరు, డిఫరెంట్ అని మరొకరు రాశారు. ఆ పెళ్లి కొడుకు అయితే నవ్వు ఆపుకోలేకపోయాడు. ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.
మొహానికి కొంచెం గడ్డం ఉంది కానీ.. వారు చక్కగా రెడీ అయ్యారు. ఏ మాత్రం సిగ్గుగా ఉండలేదు. ఏం చక్కా నడచి వెళ్లిపోయారు. వీడియో చూసినంత సేపు ఆప్పు ఆపుకోలేకపోయామని కొందరు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications