అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ ఎలా పేలిందో లైవ్‌లో చూడండి.. అయినా గర్భిణి సేఫ్(వీడియో)
ప్రాణానాలను కాపాడే ఆక్సిజన్ సిలిండరే అంబులెన్స్‌లో బాంబుగా మారింది. ఒక్కసారిగా పెలి అలజడి సృష్టించింది. ఆ సమయంలో ఓ గర్భిణితోపాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా అదే అంబులెన్స్‌లో ఉన్నాయి. అయితే, ఈ ప్రమాదంలో వారు బతికి బయటపడ్డారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో..
మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో అర్థరాత్రి నడిరోడ్డుపై భారీ ప్రమాదం తప్పింది. అత్యవసర చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో గర్భిణితోపాటు ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో వెళుతున్నారు. అయితే, ఒక్కసారిగా ఆ వాహనంలో మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని నిలిపివేసి, గర్భిణితోపాటు ఆమె కుటుంబ సభ్యులను కిందకు దింపాడు. అలా దిగిన క్షణాల వ్యవధిలోనే వాహనంలోని వేడికి అంబులెన్స్‌లోని ఆక్సిజన్ సిలిండర్ పెద్ద పేలుడుకు కారణమైంది.

#Breaking | Ambulance carrying pregnant woman blasts after catching fire in Maharashtra's #Jalgaon
— Abdul khabir jamily (@JamilKhabir396) November 13, 2024
Notably, no one was reported hurt as the driver's alertness made him notice the smoke coming out from vehicle, leading to quick evacuation of those on board.
More details awaited.… pic.twitter.com/sh0YMA59tn
పేలిన దృశ్యాల వీడియో..
ఎరండోల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గర్భిణీ, ఆమె కుటుంబాన్ని అంబులెన్స్‌లో జల్గావ్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నగా మంటలు వ్యాపిస్తున్న సమయంలోనే హుటాహుటీన కిందకు దిగిపోవడంతో వారంతా ప్రాణాలు కాపాడుకోగలిగారు. అంబులెన్స్‌లోని ఆక్సిజన్ సిలిండర్ భారీ శబ్ధంతో పేలిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications