VIRAL VIDEO:స్కూల్‌లో స్టెప్పులు, చిన్నారి అమేజింగ్ డ్యాన్స్ షో, ఎంకరేజ్, వైరల్
స్టేజీ మీద ఎక్కి డ్యాన్స్ చేయాలంటే భయం ఉంటుంది. దీనినే స్టేజ్ ఫియర్ అంటాం. వందలు, వేల మందిలో జనం ఉన్న కొందరు భయం లేకుండా మాట్లాడతారు. కానీ పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం గురించి చెప్పలేం కదా.. అవును ఫియర్ ఉంటుంది. మరీ పిల్లలు అయితే.. వారు కూడా భయపడటం సహాజమే.. కొందరు అల్లరి చేస్తారు. మరికొందరిలో అదేం ఉండదు. ఇక్కడ ఓ చిన్నారి మాత్రం అలా చక్కగా డ్యాన్స్ చేసింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

స్కూల్‌లో స్టెప్పులు..
గుల్జార్ సహెబ్ అనే యూజర్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. దివాళి పండగ సమయంలో స్కూల్‌లో సెలబ్రేషన్స్ నిర్వహించారు. అందులో రాజస్థానీ పాటకు చిన్నారి చక్కగా డ్యాన్స్ చేసింది. చాలా మంది టీచర్లు, వందలాది మంది విద్యార్థులు ఉండగా ఆమె డ్యాన్స్ చేసింది. ఆమెను అక్కడ ఉన్నవారు ఎంకరేజ్ చేశారు. చప్పట్లు కొడుతూ చిన్నారిలో మరింత జోష్ నింపారు. ఒక్క నిమిషం ఉన్న వీడియోలో.. ఆ చిన్నారి చక్కగా డ్యాన్స్ చేశారు.

రాజస్థానీ పాటకు డ్యాన్స్
స్కూల్ యూనిఫామ్ వేసుకొని మరీ చిన్నారి డ్యాన్స్ చేశారు. 'మేరా బల్మా బడా సాయన' అనే రాజస్థానీ పాటకు డ్యాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్ చేయగా.. అక్కడ ఉన్న వారందరూ ఎంకరేజ్ చేశారు. చిన్నారి తన ఎనర్జీ లెవల్స్ ఏమీ తగ్గకుండా మరీ స్టెప్పులు వేశారు. వీడియోకు 'లుక్ ఎట్ ద టాలెంట్' అనే క్యాప్షన్ పెట్టారు. ఆ వీడియో నెటిజన్ల కామెంట్లతో నిండిపోయింది. అందరూ వావ్.. చాలా బాగుందని కామెంట్ చేస్తున్నారు. చక్కగా డ్యాన్స్ చేశావ్ చిన్నారి అంటున్నారు.
అమేజింగ్ డ్యాన్స్
వావ్.. అమేజింగ్ డ్యాన్స్ బై లిటిల్ బేబీ అని రాశారు. చూడండి.. వారు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో అని మరొకరు రాశారు. వావ్ సో క్యూట్ అని మరొకరు రాశారు. చాలా మంది.. బాగుందని, నైస్ అని రాశారు. ఆమె ఎనర్జీ లెవల్స్ మాములుగా లేవని అంటున్నారు. ఆమె ఏ మాత్రం.. అలసిపోకుండా డ్యాన్స్ చేస్తోందని కామెంట్ చేశారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications