viral video:కొండచిలువను ఎదురొడ్డి.. ధీరత్వం చూపిన మార్జాలం
కృరమృగాలు, విష సర్పాల నుంచి చిన్న చితక పశు, పక్ష్యాదులు తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. వాటి తల్లులు అయితే పోరాటం చేయాల్సి వస్తోంది. అవును నిజమే ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో ఓ కొండ చిలువ ఉంది. ఆ పక్కనే పిల్లి.. దాని పిల్లలు ఉన్నాయి. ఇక వాటి సంగతి అంతే సంగతులు అని అనుకుంటారు. కానీ ఆ వీడియోలో ఆ పిల్లి ప్రదర్శించిన ధైర్య సాహసాలు మాములుగా లేవు. అవును మీరు కూడా ఆ వీడియో చూడండి.

కొండ చిలువను ఢీ కొని
వీడియోను ఇన్ స్టలో పోస్ట్ చేశారు. అందులో ఓ కొండచిలువల మెల్లగా వస్తోంది. అయితే అప్పటికే దానిని గమనించిన పిల్లి.. ఏ మాత్రం భయపడలేదు. అదరలేదు.. బెదరలేదు. దానిపై పోరాటం చేసింది. అవును అందులో ఆ పిల్లి ప్రదర్శించిన ధైర్య సాసాహలు మాములుగా లేవు. దాని పక్కనే పిల్ల కూడా ఉంది. అయినప్పటికీ కొండ చిలువపై ఫైట్ చేసింది.

పోరాటం..
దానిని చూస్తేనే ఫైర్ అయ్యింది. అప్పటికే ఫైతాన్ నోరు తెరిచి కనిపించింది. పిల్లి కూడా లేని ధైర్యాన్ని ప్రదర్శించింది. దానికి తప్పలేదు. పిల్లల కోసం మొండిగా ముందుకు వెళ్లింది. అవును.. ప్రాణం పోతుందని అనుకోలేదు. తన పిల్లలను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుంది. పెద్ద.. కొండ చిలువను ఎదురించడం అంటే మాములు విషయం కాదు. జనాలే భయపడుతుంటారు. మరీ ఆ మార్జాలం మాత్రం ఎదురొడింది.
భయమెస్తోంది
వీడియోలో ఆ పామును చూస్తే సగటు మనిషికి భయం వేస్తోంది. కానీ పిల్లి మాత్రం అలా చేయలేదు. తాను పోరాడకపోతే.. తనను, పిల్లలను అదీ తినేస్తోందని తెలుసు.. సో వేరే ఆప్షన్ లేదు.. లైఫ్ అండ్ డెత్‌లా ఇష్యూ ఉండే.. ఇక అందుకే ఒంటరిగా ఫైట్ చేసింది. వీడియోను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వావ్ అంటూ కొనియాడుతున్నారు. ఆ పిల్లి చేసిన ధైర్యం చూడు అంటూ కామెంట్స్ చేశారు.












Click it and Unblock the Notifications