వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిమ్మతిరిగే జవాబులు: 'అమ్మ' ఆత్మకు పూజలు చేసేందుకేనంటూ...

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ లో దోపిడికి పాల్పడి, వాచ్ మెన్ ను హత్య చేసిన నిందితులు బెయిల్ కోసం కొత్త నాటకం ఆడారు. అయితే ఈ డ్రామాను విన్న జడ్జీలు నివ్వెరపోయారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఊటీ: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ లో దోపిడికి పాల్పడి, వాచ్ మెన్ ను హత్య చేసిన నిందితులు బెయిల్ కోసం కొత్త నాటకం ఆడారు. అయితే ఈ డ్రామాను విన్న జడ్జీలు నివ్వెరపోయారు.అయితే ఎట్టకేలకు నిందితులకు బెయిల్ ను రద్దుచేసింది కోర్టు.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కొడనాడు ఏస్టేట్ లో ఈ ఏడాది ఏప్రిల్ 24వ, తేదిన దోపిడి జరిగింది. ఏస్టేట్ వాచ్ మెన్ ను హత్య చేసి నిందితులు దోపిడికి పాల్పడ్డారు.

“We came to perform rituals not murder” say suspects in Jayalalithaa's Kodanad estate murder case

జయలలిత మాజీ కారు డ్రైవర్ కనకరాజ్ నేతృత్వంలో 11 మంది దుండగలు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు.అయితే ఈ కేసులో నిందితులైన వారిలో కనకరాజ్ తో పాటు మరో వ్యక్తి రోడ్డుప్రమాదంలో మరణించారు.

ఈ కేసులో నిందితులైనవారిని పోలీసులు అరెస్టుచేశారు. అయితే వీరిలో కేరళకు చెందిన తాంత్రికుడు సంతోషసామి, జీతన్ జాయ్, మనోజ్ సామి, షంషీర్ అలీ బెయిల్ కోరుతూ ఊటీలోని జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వారికి ప్రభుత్వ న్యాయవాది వారికి బెయిల్ ఇవ్వకూడదని వాదించారు.

కొడనాడు ఏస్టేట్ లో జరిగిన వాచ్ మెన్ హత్యకు, దోపిడిలకు ఈ నలుగురు నిందితులకు ఎలాంటి సంబంధం లేదని వాదించారు. ఈ ఏస్టేట్ లో జయ ఆత్మ సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో శాంతిపూజల కోసమే వెళ్ళారని చెప్పారు.

ఈ కారణంగానే బెయిల్ మంజూరు చేయాలని వాదించారు. న్యాయమూర్తితో పాటు అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు. అయితే కట్టుకథలు మాని సక్రమంగా వాదనలు విన్పించాలని హెచ్చరిస్తూ న్యాయమూర్తి నిందితుల బెయిల్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

English summary
The petition stated “We perform special rituals to get rid of evil forces in houses in Kerala. We were asked to perform one such ritual in the Kodanad bungalow. The pooja was performed before the murder but the policemen have arrested us just because we were there before the murder. We are in no way connected with this murder. Hence, we request a bail on this ground."The bail was rejected as few other cases against these suspects awaited hearing in the Kerala Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X