ఎన్నో ఏళ్లుగా మేము ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం... అమీర్‌ఖాన్..
నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం.. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ సోషల్‌మీడియాలోని తన ఖాతాలో ఒక వీడియో రిలీజ్ చేశారు. తాను, తన కూతురు ఐరాఖాన్ ఎన్నో ఏళ్లుగా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నామని, అందుకోసం ప్రత్యేకంగా థెరపీ కూడా తీసుకుంటున్నామని ఈ వీడియోలో వెల్లడించారు. మానసిక సమస్యలుండి అవసరమైనప్పుడు థెరపీ తీసుకోవడంలో సిక్కుపడాల్సిన అవసరం లేదని వారు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందో చూద్దాం పదండి.
నిపుణులను సంప్రదించడమే కీలకం : మ్యాథ్స్ నేర్చుకోవాలంటే స్కూల్‌కు కానీ, గణిత ఉపాధ్యాయుని దగ్గరకు గానీ వెళతాం. అలాగే, హెయిర్ కట్‌చేసుకోవాలంటే సెలూన్‌కానీ, షాప్‌కానీ వెళతాం. ఆ పనిలో నిపుణులైన వారే మనకు హెయిర్ కట్ చేస్తారు. ఇంటికి సంబంధించిన పని ఏదైనా అంటే ఫర్నీచర్ పని కానీ, వెల్డింగ్, లేదా ప్లంబర్ పనులనుకోండి వాటిని బాగుచేసేందుకు ఆ పని తెలిసిన వారి దగ్గరికి వెళతాం.. జీవితంలో మనం చేయలేనివి, చేసుకోలేని పనులు చాలానే ఉన్నాయి. ఆ పని తెలిసిన వారి సహాయం తీసుకోవడం మనకు ఎంతైనా అవసరం.

చాలామంది ఇంట్లోని చిన్న చిన్నపనులకు అంటే ఉదాహరణకు కార్పెంటర్ పని అనుకోండి. కార్పెంటర్ దగ్గరికి ఎలాంటి సంకోచం లేకుండా వెళ్లి పని చేపించుకుంటారు. అదేవిధంగా ఏదైనా అనారోగ్యానికి గురయినప్పడు డాక్టర్‌ను సంప్రదిస్తారు. మానసిక సమస్య కూడా ఇలాంటిదే. ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారు కూడా ఎలాంటి సంకోచం లేకుండా నిపుణుల దగ్గరకి వెళ్లాలి. అందుకోసం అవసరమైన ప్రత్యేకమైన థెరపీలను చేసుకోవాలి అని చెబుతున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్, కూతురు ఐరాఖాన్.
ఎంతో మంది సెలబ్రిటీలు సైతం : మానసిక సమస్య అంటే ఏదో తెలియని భయం చాలామందిలో ఉంది. ఆ భయాన్ని అధిగమించాలంటే ఆ సమస్య మనలో ఉందని ముందుగా చెప్పుకోవాలి. ఆ తర్వాత నిపుణుల సలహా తీసుకోవాలి. బాలీవుడ్‌లో చాలామంది సెలబ్రటీలు ఈ సమస్యను ఎదుర్కొన్నవారే. ఆ సమస్యను అధిగమించే ఇప్పడు పెద్ద పెద్ద స్టార్స్‌గా మన ముందున్నారు. బాలీవుడ్ నటి దీపికా, ఆలియాభట్, కరణ్ జోహార్ వంటి వారు కూడా ఈ సమస్యను ఎలా ఎదుర్కోన్నారో చాలా సందర్భాల్లో పంచుకున్నారు. కాబట్టి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా.. ఈ సమస్యతో బాధపడుతున్న వారంతా ముందుగా ఈ సమస్యను గుర్తించి, నిపుణుల సలహాలను తీసుకోవడం ఉత్తమం..












Click it and Unblock the Notifications