కొన్ని తప్పుడు నిర్ణయాలను తీసుకున్నాం..ఆ మాట నిజమే: తేల్చేసిన అమిత్ షా

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్‌లో అత్యంత శక్తిమంతుడిగా పేరు తెచ్చుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం కొన్ని తప్పుడు నిర్ణయాలను తీసుకుందని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వపరంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నామని ఆయన అంగీకరించారు. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారి తీసిన మూడు వ్యవసాయ చట్టాలు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ).. వంటి అంశాల గురించి ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) 94వ వార్షిక సర్వసభ్య సమావేశానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. పాలనాపరంగా కొన్ని తప్పుడు నిర్ణయాలను తాము తీసుకున్నామని, ఉద్దేశం మాత్రం తప్పు కాదని స్పష్టం చేశారు. తమ ఉద్దేశం ఎప్పుడూ దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉంటుందని తేల్చి చెప్పారు. దేశాన్ని కాదని వ్యక్తులు లేదా సంస్థలకు ప్రయోజనాలను కట్టబెట్టాలనేది తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు.

We may have made some wrong decisions, intent was never wrong: UoH Amit Shah

ఏడు సంవత్సరాల తమ ప్రభుత్వ హయాంలో ఏనాడు అవినీతి మాట వినిపించలేదని అన్నారు. తమ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రాలేదని అన్నారు. అవినీతి మరకకు దూరంగా తమ పాలన సాగుతోందని, దాన్ని కొనసాగిస్తామని అమిత్ షా చెప్పారు. కొన్ని నిర్ణయాలు తప్పే అయినప్పటికీ.. తమ ఉద్దేశం సరైనది కావడం వల్ల అవినీతి మరక అంటలేదని అన్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం కోసం పలు విధానపరమైన నిర్ణయాలను తీసుకున్నామని గుర్తు చేశారు.

కరోనా సంక్షోభ పరిస్థితులను గట్టెక్కిన తరువాత.. దేశం రెండంకెల వృద్ధి రేటును అందుకుంటుందని తాను ముందు నుంచీ ఆశిస్తున్నానని అమిత్ షా అన్నారు. రెండంకెల వృద్ధిరేటును అందుకోవడం తనకు పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదని చెప్పారు. కరోనా బారిన పడి కోలుకున్న దేశాల్లో భారత్ శరవేగంగా ఆర్థికాభివృద్ధిని సాధించిందని అన్నారు. మరే దేశం కూడా రెండంకెల అభివృద్ధిని అందుకునే పరిస్థితులు లేవని చెప్పారు.

దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక రంగం పురోగమించడానికి మూల స్తంభాలుగా భావించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడానికి అనేక పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. వాటిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా కీలకమైదని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+