దెబ్బకు ఐఐటీ బాబా సూసైడ్ అటెంప్ట్- బర్త్‌డే రోజే?

IIT Baba: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవలే ముగిసిన మహా కుంభమేళా సందర్బంగా దేశవ్యాప్తంగా చిరపరిచితమైన పేరు.. ఐఐటీ బాబా. అసలు పేరు అభయ్ సింగ్. ఐఐటీ-బోంబే పూర్వ విద్యార్థి. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. 2008 జేఈఈలో జాతీయ స్థాయిలో 731వ ర్యాంక్ సాధించిన ఉన్నత విద్యావంతుడు. ఆ తరువాత బాబాగా అవతారం ఎత్తారు.

మహా కుంభమేళా సందర్భంగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుందంటూ జోస్యం చెప్పాడు గానీ అది వాస్తవరూపాన్ని దాల్చలేదు. దెబ్బకు దేశవ్యాప్తంగా శతృవులు తయారయ్యారు. తనపై దాడికి కొందరు కాషాయధారులు ప్రయత్నించారంటూ హల్‌చల్ చేశారీ మధ్యే.

We received this information that the IIT Baba might commit suicide says Jaipur Police

ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన వార్తల్లోకెక్కారు. రాజస్థాన్ జైపూర్‌‌లో ఓ హోటల్‌లో దిగిన ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పోలీసులకు సమాచారం అందింది. పైగా బర్త్‌డే నాడే బలవన్మరణానికి ప్రయత్నించారంటూ వార్తలు రావడం హల్‌చల్ రేపింది.

ఈ సమాచారం అందిన వెంటనే జైపూర్ శిప్రపథ్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు షాక్ ఇచ్చాడు ఐఐటీ బాబా. తాను గంజాయిని సేవించినట్లు వెల్లడించాడు. గంజాయి మత్తులో ఉన్న సమయంలో ఆయన ప్రవర్తనను చూసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చంటూ సమాచారం ఇచ్చారని శిప్రపథ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేంద్ర గొడారా తెలిపారు.

ఐఐటీ బాబా వద్ద గంజాయి లభించిందని, నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం ప్రకారం అది నిషేధిత పదార్థం కావడం వల్ల ఆయనను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గంజాయి చాలా తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల బెయిల్ బాండ్‌పై విడుదల చేశామని వివరించారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పోస్ట్ చేసిన సమాచారం ఆధారంగా ఆత్మహత్య చేసుకోబోతున్నాడంటూ ఆయన అనుచరులు తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. బెయిల్ బాండ్‌పై విడుదల చేసినప్పటికీ- అవసరమైతే మళ్ళీ విచారణకు పిలుస్తామని రాజేంద్ర గొడారా పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై మాట్లాడటానికి ఐఐటీ బాబా నిరాకరించారు. నేడు తన బర్త్‌డే అని, సంతోషంగా ఉండాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+