వాటికి విలువ ఇవ్వట్లేదు- మోదీ చేతుల్లో అంతా: అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్.. ఊహించని విధాంగా షాక్ ఇచ్చారు. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)- బీజేపీ కూటమి ప్రభుత్వానికి జైకొట్టారు. షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేశారు.
ఆయనతో పాటు తొమ్మిది మంది ఎన్సీపీ శాసన సభ్యులు- హసన్ ముష్రిఫ్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వల్సే పాటిల్, ధనంజయ్ ముండే, ఆదితి టత్కరే, సంజయ్ బాబురావ్ బన్సొడే, అనిల్‌భాయ్ దాస్ పాటిల్, ఆత్రమ్ ధర్మారావ్ బాబా భగవంత్ రావ్.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో ఈ మధ్యాహ్నం గవర్నర్ రమేష్ బైస్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకారం అనంతరం అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్.. విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు తాము చేసిన పనికి చాలామంది తమను విమర్శించొచ్చని, వాటిని తాము పట్టించుకోవట్లేదని, విలువ ఇవ్వట్లేదని అన్నారు. మహారాష్ట్ర ప్రగతికి కృషి చేస్తూనే ఉంటామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చారు.
తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించినప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారని అజిత్ పవార్ అన్నారు. ఎన్సీపీ నాయకులు గానే తాము షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వానికి మద్దతిచ్చామని పేర్కొన్నారు. తాము ఎన్సీపీలో చీలిక తీసుకోచ్చామనడంలో అర్థం లేదని, అసలు ఎన్సీపీ తమదేనని, ఈ పేరు, ఎన్నికల గుర్తుతోనే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం తమతో లేని ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు అజిత్ పవార్. కొందరు ఎమ్మెల్యేలు ఇంకా టచ్‌లోకి రాలేదని, వారిని కూడా సంప్రదించి.. మద్దతు తీసుకుంటామని అన్నారు. పదవుల కోసం తాము ప్రభుత్వంలో చేరామని విమర్శించడంలో అర్థం లేదని, జాతీయ స్థాయిలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications