Marriage Gift Blast: పెళ్లికి హోం థియేటర్ గిఫ్ట్.. ఆన్ చేయగానే బ్లాస్ట్.. ఇద్దరు మృతి..
సాధారణంగా పెళ్లి చేసుకుంటే బంధువులు, స్నేహితులను పిలుస్తాం. వారు గిఫ్ట్ లు పట్టుకుని వస్తే సంతోషిస్తాం. వట్టి చేతులతో వస్తే వీడు ఇంత పిసినారా అని అనుకుంటాం. కానీ ఓ చోట పెళ్లికి వచ్చిన గిఫ్ట్ ను ఇంటికెళ్లి ఓపెన్ చేస్తే అది పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఛత్తీస్ గడ్ లో జరిగింది. కబీర్ ధామ్ జిల్లాలో సోమవారం ఓ ఇంట్లో పెళ్లి కానుకగా వచ్చిన హోమ్ థియేటర్ ను ఓపెన్ చేయగా అది పేలిపోయింది.
ఈ ఘటనలో పెళ్లి కుమారుడితో పాటు అతని తమ్ముడు మృత్యవాత పడ్డారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉంది. చమరి గ్రామానికి చెందిన యువకుడు హేమేంద్ర మేరవి, అంజానా గ్రామానికి చెందిన యువతికి రెండు రోజుల క్రితం పెళ్లి అయింది. పెళ్లలో బంధుమిత్రులు, స్నేహితుల నుంచి వారికి గిఫ్ట్ లు వచ్చాయి. సోమవారం ఉదయం 11:30 గంటలకు హేమేంద్ర ఇంటికి తెచ్చిన పెళ్లి కానుకలను ఓపన్ చేసి చూశారు.

అందులో వారికి ఒక హోమ్ థియేటర్ ఉంది. దీంతో తన కుటుంబసభ్యులతో కలిసి హోమ్ థియేటర్‌ను సెట్ చేసి ఆన్ చేశాడు. అయితే హోమ్ థియేటర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు దాటికి ఇంటి పై కప్పు ఎగిరిపోయింది. హోం థియేటర్ లో గన్ పౌడర్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే ఎలా పేలుడు సంభవించిందో తెలుస్తుందన్నారు.
పోలీసులు కొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలంలో ఉందని ఏఎస్పీ తెలిపారు. ఇది కుట్ర కాదా అనే దానిపై వ్యాఖ్యానించడానికి పోలీసులు నిరాకరించారు. ఒకటి లేదా రెండు రోజుల్లో తమకు స్పష్టమైన అవగాహన వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications