బెంగాల్ లో నువ్వా నేనా, కూలుతున్న కోటలు- పిక్చర్ క్లియర్..!!
పశ్చిమ బెంగాల్ ఫలితాల పై స్పష్టత వస్తోంది. బీజేపీ - టీఎంసీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు కొనసాగుతోంది. ఇద్దరూ ఎక్కడా తగ్గటం లేదు. తొలి ఫలితాల్లో ఇప్పటి వరకు బీజేపీ స్వల్ప ఆధిక్యతలో కొనసాగుతోంది. అనూహ్యంగా కాంగ్రెస్ కు స్థానాలు పెరుగుతున్న సంకేతాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే... హంగ్ దిశాగా ఫలితాలు ఉంటాయా అనే చర్చ మొదలైంది. అయితే.. టీఎంసీ కంచుకోటల్లో బీజేపీ ఆధిక్యత కొనసాగటం ఆసక్తిగా మారుతోంది.
పశ్చిమ బెంగాల్ తొలి ఫలితాల పై స్పష్టత వస్తోంది. ట్రెండ్స్ ప్రజా నాడిని వెల్లడిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం అవుతాయా లేదా అనే టెన్షన్ వేళ వాస్తవ ఫలితాలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్.. ఆ తరువాత ఈవీఎం ల కౌటింగ్ ప్రారంభించారు. తొలి ఫలితాల్లో టీఎంసీ కంటే బీజేపీ ఆధిక్యత కొనసాగుతోంది. రెండు పార్టీల మధ్య హోరా హోరీ పోరులో బీజేపీ ఆధిక్యత కొనసాగుతోంది. భవానీ పూర్, నందిగ్రాంలో సువేందు ఆధిక్యతలో నిలిచారు. ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్స్ కు అనుగుణంగా బీజేపీ 108 నియోజకవర్గాల్లో.. మమతా పార్టీ టీఎంసీ 107 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. కాగా, కాంగ్రెస్ 4 స్థానాల్లో లీడ్ లో ఉంది. పలు చోట్ల నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లు కనిపిస్తున్నాయి. అందరి దృష్టి పశ్చిమ బెంగాల్‌పైనే నిలిచింది. ఇక్కడ 294 అసెంబ్లీ స్థానాలుండగా, నేడు 293 స్థానాల ఫలితాలను ప్రకటించనున్నారు.

హంగ్ దిశగా ఫలితాలు..?
ఫాల్టా నియోజకవర్గంలో పోలింగ్‌ను ఈసీ రద్దుచేసింది. ఇక్కడ ఈ నెల 21న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో గత మూడు ఎన్నికల్లో తిరుగులేని విజ యం సాధించిన టీఎంసీ నాలుగోసారి విజయంపై ధీమాగా ఉంది. మరోవైపు బెంగాల్‌లో పాగా వేయాలని శక్తియుక్తులన్నీ ధారపోసిన బీజేపీ కూడా తనదే విజయం అని చెప్పుకుంటోంది. ఎగ్జిట్‌పోల్స్‌లో ఎక్కువశాతం మాత్రం బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. అయితే, తాము 200 పైచిలుకు స్థానాల్లో గెలవబోతున్నామని సీఎం మమత ప్రకటించారు. మమతా పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గం ఫలితంపైఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇక్కడ ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి తాజా ట్రెండ్స్ మేరకు లీడ్ లో ఉన్నారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఆయన మమతను ఓడించారు. ఈసారి కూడా అదే ఫలితం వస్తుందా? మమత పైచేయి సాధిస్తుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.













Click it and Unblock the Notifications