రైలు దూసుకొస్తున్నా.. పరుగెత్తుకుంటూ వెళ్లి, వ్యక్తిని కాపాడిన లేడీ కానిస్టేబుల్ (వీడియో)

కోల్‌కతా: రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని చివరి క్షణంలో కాపాడింది రైల్వే మహిళా కానిస్టేబుల్. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పూర్వ మేదినిపూర్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ పుటేజీ వైరల్‌గా మారింది. దీంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి పూర్వ మేదినిపూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఓ వైపు నుంచి రైలు రావడాన్ని గమనించిన అతను.. వెంటనే ఫ్లాట్‌ఫాం దిగి పట్టాలపై పడుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. పక్క ఫ్లాట్‌ఫాం విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కే సుమతి అతడ్ని గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు.

rpfpolicesavelife

వెంటనే పట్టాలపైకి పరుగెత్తుకుంటూ వెళ్లి క్షణాల్లోనే అతడ్ని పట్టాలపైనుంచి పక్కకు లాగారు. రైలు అక్కడికి చేరుకునే క్షణాల వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది. ఆ తర్వాత మరో ఇద్దరు ప్రయాణికులు కూడా అతడ్ని రక్షించేందుకు సాయపడ్డారు. ముగ్గరూ కలిసి అతడ్ని ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చారు.

రైలు వేగంగా దూస్తుకొస్తున్నప్పటికీ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పట్టాలపై పరుగెత్తుకుంటూ వెళ్లి వ్యక్తిని కాపాడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియోను ఆర్పీఎఫ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రయాణికుల భద్రత పట్ల ఆమె నిబద్దతను ప్రశంసించింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఆమె సాహసాన్ని కొనియాడుతూ కామెంట్లు చేస్తున్నారు. తన ప్రాణాలను పణంగా పెట్టి వ్యక్తిని కాపాడిన ఆమెకు తగిన రివార్డు ఇవ్వాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+