పార్లమెంట్ లో కలకలం రేపిన కలర్ స్మోక్ డబ్బాలు అంటే ఏమిటి ?, ఎలా తీసుకున్నారు ?
పార్లమెంటులో పెద్ద భద్రతా లోపం ఉందనే విషయం కళ్లకు కట్టినట్లు కనపడింది. బుధవారం ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ భవనంలోని పబ్లిక్ గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకి పసుపు రంగు పొగలు వెదజల్లుతున్న డబ్బాలను తెరిచి సభలో ఎంపీలను భయాందోళనలకు గురి చేశారు. అప్రమత్తమైన ఎంపీలు, భద్రతా సిబ్బంది లోక్‌సభ ఛాంబర్‌లోనే ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నారు.
ఓ వ్యక్తి ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఎంపీ సీట్ల మీదకు దూకి తరువాత డెస్క్‌లపైకి ఎక్కి హల్ చల్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. నిందితుడి మరో సహచరుడు విజిటర్స్ గ్యాలరీ నుండి దట్టమైన పొగను వెదజల్లే పసుపు రంగు గ్యాస్ డబ్బాను విసిరాడు, దీని దెబ్బతో లోక్ సభలో పసుపు రంగు పొగ ఎంపీలతో పాటు నిందితుడిని చుట్టుముట్టింది. ఇదే సమయంలో ఎంపీలు, భద్రతా సిబ్బంది చాకచక్యంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

లోక్ సభలో బుధవారం కలకలం రేపిన రంగు గ్యాస్ డబ్బాలు ఎలా లోపలికి వెళ్లాయి అని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైయ్యింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చిల్లర మార్కెట్ లో రంగు గ్యాస్ డబ్బాలు ఎక్కువ అయ్యాయి. రంగు గ్యాస్ డబ్బాలు అంటే ఏమిటి? అని అందరూ గూగుల్ లో తెగ వెతకడం మొదలుపెట్టారు ఈ రంగు డబ్బాలను స్మోక్ డబ్బాలు లేదంటే స్మోక్ బాంబ్స్ అని కూడా పిలుస్తారు.

ఈ స్మోక్ గ్యాస్ డబ్బాల ఉపయోగం చాలా దేశాల్లో చట్టబద్ధం. దాదాపు అన్ని రిటైల్ మార్కెట్‌లలో అందుబాటులో ఉంటున్నాయి. చాలా మంది వివిధ ప్రయోజనాల కోసం ఈ స్మోక్ గ్యాస్ కంటేనర్లు ఉపయోగిస్తారు. ఈ డబ్బాలను సైనిక సిబ్బంది ఉపయోగిస్తారు. పౌరులు క్రీడా కార్యక్రమాలు, ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌లలో ఈ కలర్ గ్యాస్ డబ్బాలు ఉపయోగిస్తారు.

ఇటీవల ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌లలో వీటిని ఎక్కువగా వాడటం గమనించవచ్చు. కలర్ టిన్ గ్యాస్ గ్రెనేడ్‌ల ద్వారా వెలువడే దట్టమైన పొగతో ఏర్పడిన పొగ తెరలు లేస్తాయి. సినిమా షూటింగ్ లు, వీడియో ఫోటోగ్రఫీలో కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. క్రీడలలో, ముఖ్యంగా ఫుట్‌బాల్‌లో, అభిమానులు తమ క్లబ్‌ల రంగులను ప్రదర్శించడానికి పొగ డబ్బాలను ఉపయోగిస్తారు. యూరోపియన్ ఫుట్‌బాల్‌లో, అభిమానుల క్లబ్‌లు స్మోక్ క్యాన్‌లు మరియు పైరోలను ఉపయోగిస్తారని సమాచారం. ఇలాంటివే ఇప్పుడు లోక్ సభలోకి తీసుకెళ్లడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications