ఏమిరా వారీ.. పదేళ్లు కష్టపడి జైలుపాలైతిరి గదరా..! అమెరికా నా..? మజాకా..?
హైదరాబాద్ : అంతా అద్బుతంగా చేసారు. కాలంతో పాటు సాంకేతికంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. అసాద్యాన్ని సుసాద్యం చేసుకున్నారు. అనుకున్న దానికంటే విపరీతంగా లాభాలు గడించారు. అంతోనే కక్కుర్తి పడి కటకటాల పాలయ్యారు. అజయ్ బ్రత్వాల్, దిలీప్ నైక్, భావేష్ మిస్త్రీలు అనే ముగ్గురు భారతీయులు మంచి స్నేహితులు. అమెరికాలో స్థిరపడ్డారు. తెలివి తేటలకు, తెగింపుకు ఎలాంటి కొరత లేదు. సొంతంగా కంపెనీ నెలకొల్పి బాగా పనిచేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేసారు. కష్టపడ్డారు.
వారి ఆశయం నెరవేరింది. కోట్ల సంపాదించాలన్న వారి కల నెరవేరింది. కంపెనీ ఊహించని లాభాల బాటలో పయనించింది. ఒకటికి రెండు బ్రాంచీలు కూడా అనతి కాలంలోనే ఏర్పాటయ్యాయి. న్యూజెర్సీ, నెవార్క్, న్యూయార్క్ నగరాల్లో కంపెనీ విస్తరించింది. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో వారిలో నిద్రిస్తున్న కక్కుర్తి ఒక్కసారిగా మేల్కొంది. షాట్ కట్ చేస్తే, ఇపుడుఆ మిత్ర త్రైయం జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. ఎందుకు..? ఎలా..?

పదేళ్లుగా కష్టపడి జైలుకు వెళ్లిన చందంగా తయారయ్యింది మనవాళ్ల పరిస్థితి. పదేళ్లుగా వారు చేసిన తప్పును పట్టుకుని విచారించి శిక్ష వేశారు. ఆదాయపన్ను ఎగ్గొట్టిన కేసులో ఈ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. ఇంతకీ మనవాళ్లు నెలకొల్పిన ఫార్మసీ కంపెనీ ద్వారా 9 మిలియన్ డాలర్లు లాభం రాగా... వారు కేవలం 4 మిలియన్ డాలర్లు మాత్రమే లాభం వచ్చినట్లు ప్రభుత్వానికి చూపారు. మిగతా సొమ్ము చెక్కుల ద్వారా 2 అక్కౌంట్స్ లో వేసుకున్నారు. వారి ఆటలు ఎంతో కాలం సాగలేదు. అన్ని తెలివితేటలు ఉండి... లాభాలు సంపాదించి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఏమిరా వారీ.. ఎంత పని సేసితివిరా.. ! మీ కక్కుర్తిలో కమండలం..!!
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications