• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వాలెంటైన్స్ డే: వైన్, డిన్నర్ పార్టీలకు బదులుగా మీరు చేయాల్సిన పని మరొకటి ఉంది?

|

జీవితానికి ఒక సార్ధకత అనేది ప్రేమరూపంలో దొరుకుతుంది అని అనేకుల అభిప్రాయం. కొందరు ప్రేమ నుంచే జీవితం మొదలవుతుందని భావిస్తుంటారు. ఈ అభిప్రాయాలు జంటల మధ్యనే ఉంటాయి. కానీ ప్రేమ అనేది అనంతం. అది కేవలం జంటలకే పరిమితం కాలేదు. క్రమంగా ప్రకృతి, వృక్షాలు, జంతువులు, పిల్లలు, తల్లిదండ్రులు అన్నీ కూడా ఈ ప్రేమలో భాగస్వాములే. ఈ ప్రేమ అనే భావన ప్రపంచంలోని సజీవులందరికీ ఖచ్చితంగా అవసరమే.

ఈ విధంగా ప్రేమ, ప్రేమకి సంబంధించిన ఏ పండుగైనా జంటల మధ్య మాత్రమే జరపాలి అనడం సబబు కాదు. ఈ విషయంలో మనకు నచ్చిన ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయడం ఉత్తమంగా ఉంటుంది. అవునా ?

 what to do on valentines day

గత వాలెంటైన్స్ డే రోజున, సీమ తన బాయ్ ఫ్రెండ్ తో ఏంతో అందమైన సమయాన్ని గడిపింది. డైమండ్ రింగ్ సహా, అనేక రకాల బహుమతులను ఇస్తూ ఒక్కసారిగా తన ఎంగేజ్మెంట్ గురించిన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆ అనూహ్య పరిణామం ఆమెని ఒక ఊహాలోకానికి తీసుకుని వెళ్ళింది. ఆ అందమైన క్షణం వారి జీవితాలలో ఆ వాలెంటైన్స్-డే రోజుని మరపురానిరోజుగా మిగిల్చింది.

సహాయం చేయదలిచిన వారు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి

ఎంతో సంతోషంతో ఆ సాయంత్రం వేళ, ఇంటిముఖం పట్టిన ఆ జంట, ఒక వీధి ద్వారా మందుకు వెళుతుండగా, అకస్మాత్తుగా సీమ చూపు వీధి చివరలో ఉన్న చెత్త-తొట్టిలో ఆహారం కోసం వెతుకుతున్న ఒక పసివాని మీద పడింది. కానీ ఆరోజు తాను చూసిన సంతోషానికి, ఆ పిల్లవాడికి ఆహారం దొరికినప్పుడు కలిగిన సంతోషానికి గల తేడా ఆమెలో అనేక ఆలోచనలను రేకెత్తించాయి.

ఆమె ముఖం పాలిపోయింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆ సంఘటన చూసిన ఎవరి మనసులో అయినా ప్రశ్నలు తలెత్తడం సహజం. ఆమెలో కూడా అలాగే మానవత్వం, మనుషుల దృష్ట్యా వేలకొలదీ ప్రశ్నలు చుట్టుముట్టాయి. నేను నా భాగస్వామి పట్ల అంతులేని ప్రేమను కనపరచాను, ఆ ప్రేమను ఎవరైనా కలిగి ఉంటారు తమ తమ భాగస్వాముల మీద. కానీ ప్రేమ అంటే అదేనా?

ఆ పిల్లవాడు చెత్తబుట్టలో ఆహారం వెతుక్కునే దిశగా, సమాజంలో ఉన్న గడ్డు పరిస్థితుల పట్ల మనకంటూ బాధ్యత లేదా ? ఆ బిడ్డ ఏం తప్పు చేశాడని, ఆ దుర్భర దారిద్రాన్ని అనుభవిస్తున్నాడు ? ఆ బిడ్డకు మనం ప్రేమను పంచాల్సిన అవసరం లేదా ? అలాగే చూస్తూ ఉండిపోవాలా ? సృష్టికర్త చేసిన తప్పిదం వలన అలాంటి జీవనాన్ని గడుపుతున్న, ఆ పసిపిల్లల పట్ల ప్రేమ, జాలి చూపాల్సిన కనీస భాద్యత మనకు లేదా ?

ఇలా ఆమె మనస్సులో ఆక్షణంలో సమాధానం లేని అనేక ప్రశ్నలు మెదిలాయి. కానీ తక్షణమే వెళ్లి, ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని, దగ్గర్లోని రెస్టారెంట్ తీసుకెళ్లి తినిపిస్తూ, ఆ పిల్లవాని గురించి అడిగి తెలుసుకుంది. ఆ బాబు పేరు రాజు, దగ్గరలో ఉన్న మురికివాడలో అతని తల్లిదండ్రులు పేదరికపుటంచులలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తూ నివసిస్తున్నారని, ముగ్గురు సోదరీమణులు, ఇద్దరు సోదరులతో ఆకలితో నిరంతరం యుద్ధం చేస్తున్నారని, ఒక్కరోజు కూడా కడుపు నిండా అన్నం తినలేని స్థితిలో ఉన్నారని తెలుసుకుంది. క్రమంగా, రాజు కుటుంబానికి సాయం చేయాలని సీమ నిర్ణయించుకుంది. వెంటనే, పిల్లలను దగ్గరలో ఉన్న స్కూల్లో చేర్పించింది. అక్కడ అన్నామృత వీళ్ళకు ఆపన్న హస్తాన్ని అందించింది. అన్నామృత పసిపిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే స్వచ్చంద సంస్థ. రాజు లాంటి పేద పిల్లల కడుపుకు ఆకలి తీరుస్తూ అనేకమంది కుటుంబాలకు ఆసరాగా నిలబడింది.

రాజు లాంటి అనేకమంది పిల్లలు పేదరికం గొలుసులో చిక్కుకుపోయి, తమ కుటుంబం రోజువారీ అవసరాలను తీర్చడం కోసంగా, కూలీ పనులకు సిద్దపడి, తమ బాల్యాన్ని పోగొట్టుకుంటున్న వారు మన చుట్టూతానే ఉన్నారు అన్నది జగమెరిగిన సత్యం. పనికి వెళ్తే వచ్చే డబ్బులతో కడుపు నిండుతుంది అన్న ఆలోచనలే వాళ్ళ చుట్టూ ఉన్నాయి. కనీసం పిల్లల కడుపు నిండుతుంది అన్న భరోసా ఉంటే తప్ప పిల్లలను పాఠశాలలకు కూడా పంపరు. అవునా? క్రమంగా ఈ పిల్లలను జాతీయ బాల కార్మిక పథకంలో ఉన్న పాఠశాలల్లో చేర్చడం జరిగింది. ఇక్కడ అన్నామృత ఈ పిల్లలకు మధ్యాహ్న భోజన వసతిని కల్పించింది. ఆ పిల్లలలో కొందరికి, ఆ భోజనమే రోజులో ప్రధాన భోజనం అంటే ఆశ్చర్యం కలుగక మానదు.

ఈ వాలెంటైన్స్ డే రోజున, మేము కోరుకునేది ఒక్కటే, ఆ బిడ్డల ఆకలిని తీర్చడానికి మీరు చూపే ప్రేమ మరియు సాయం. ప్రేమ యొక్క స్వచ్ఛమైన రూపాన్ని మాత్రమే అర్థం చేసుకునే అందమైన కలువలు ఈ పిల్లలు. వారి పట్ల కనీస భాద్యతను కలిగి ఉండడం మన కర్తవ్యం. ఈ వాలెంటైన్స్ డే రోజున, మీ ప్రేమను ఈ పసిబిడ్డలకు కూడా పంచండి. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న ఈ పిల్లల ఆకలి తీర్చడంలో కలిగే ఆనందం మాటలలో చెప్పలేనిది.

ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో ఇటువంటి అనేకమంది పిల్లలను మన చుట్టూతా చూస్తూనే ఉంటాం, ఇది కఠోర సత్యం. కానీ ఏమీ చేయలేని నిస్సహాయతకు గురవుతుంటాం. కానీ, మనం చేయగలిగిన గొప్ప కార్యం ఏమిటో తెలుసా ?, ఇటువంటి పిల్లల సంక్షేమం కోసం పనిచేసే సంస్థలకు ఏదో ఒకటి దానం చేయడం. క్రమంగా మనందరి సహకారంతో ఈదేశంలో ఏదో ఒకరోజు పూర్తిస్థాయిలో, ఇటువంటి పరిస్థితులకు స్వస్తి చెప్పే రోజులను తీసుకుని రాగలము.

'విద్య కోసం అపరిమితమైన ఆహారం' నినాదంతో ముందుకు వచ్చిన అన్నామృత, మరింత మంది పిల్లలను స్కూళ్లకు తీసుకొచ్చి విద్య గొప్పతనాన్ని చాటి చెప్పి, వారికి చదువుకునే స్వేచ్చను కల్పించడంలో భాగస్వామ్యం తీసుకుంది. భారతదేశంలో ఆకలి మరియు నిరక్షరాస్యత సమస్యలను నిర్మూలించడమే అన్నామృత ప్రధాన లక్ష్యం. క్రమంగా ఈ పసిపిల్లలకు ఈ కార్యక్రమం తరపున ఒక ఆరోగ్యకరమైన, పోషకభరితమైన మరియు స్వచ్ఛమైన భోజనాన్ని అందించడం జరుగుతూ ఉంది.

ఆరోగ్యవంతమైన ఆహారం కొరకు, పిల్లలు పాఠశాలలకు వస్తూ, ఆహారంతో పాటుగా విద్యను కూడా పొందగలుగుతున్నారు. ఆవిధంగా భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు అన్నామృత ఆపన్న హస్తం అందివ్వగలుగుతుంది. క్రమంగా పాఠశాలలలో నమోదు పెరగడం, హాజరు శాతం పెంచడం, అవసరమైన పోషకాహారాన్ని అందివ్వడం ద్వారా తెలివైన వారిగా మార్చడంలో తనవంతు ప్రోత్సాహాన్ని అందివ్వగలుగుతుంది అన్నామృత.

మీరు దానం చేసే ప్రతి రూపాయి, రాజు వంటి అనేకమంది పిల్లల కడుపు నిండేందుకు ఎంతగానో సహాయపడగలదు. ఈ వాలెంటైన్స్ డే నాడు "సీమ" వలె మనందరమూ ఉండాలని ప్రతిజ్ఞ చేద్దాం. అవసరంలో ఉన్న వారందరికీ మన ప్రేమను పంచడానికి ప్రేరణనిద్దాం. క్రమంగా ఈ ప్రపంచంలో మన దేశం అక్షరాస్యతలో, ఆకలిని జయించిన దేశాలలో ముందు ఉండేలా రూపుదిద్దుకోగలదు.

English summary
On valentine's day.. Take a trip. Eat breakfast. Enjoy a wine and chocolate tasting. Create something together. Host a game night. Recreate your first date. Unwind at a spa. Cook dinner together.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more