Budget 2024: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూ, మధ్యంతర బడ్జెట్ కూ తేడా ఏంటి?
ఈ ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్ లో పూర్తిస్ధాయి బడ్జెట్ కు బదులుగా మధ్యంతర బడ్డెట్ లేదా ఓటాన్ అకోంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం గడువు తీరిపోతున్నందున వచ్చే ఆర్ధిక సంవత్సరం మొత్తానికి సాధారణ బడ్డెట్ ప్రవేశపెట్టే అధికారం ఉండదు. కాబట్టి తిరిగి ఎన్నికయ్యే వరకూ కేవలం తాత్కాలిక అవసరాల కోసం ఇలా తాత్కాలిక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టి పార్లమెంట్ ఆమోదం తీసుకుంటుంది.
అయితే సాధారణ బడ్డెట్ స్ధానంలో ఇలా ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూ, మధ్యంతర బడ్జెట్ కూ తేడా ఉంటుంది. ఈ రెండూ ఒకటి కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 116 ప్రకారం ఓట్ ఆన్ అకౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం స్వల్పకాలిక ఖర్చులు చేసుకోవడానికి ముందస్తుగా తీసుకునే గ్రాంట్ మాత్రమే. సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే వరకు కొన్ని నెలల పాటు ఇది అమల్లో ఉంటుంది.

ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది దేశ ఖజానా నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కొన్ని నెలలపాటు ఖర్చులు, ముఖ్యమైన ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చేసే ఖర్చు కోసం పార్లమెంట్ ను కోరే అనుమతిగా చెప్పుకోవచ్చు. ఆర్థిక మంత్రి ప్రకటన ప్రకారం చూస్తే ఇది మధ్యంతర బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని తెలుస్తోంది.
అయితే ఓటాన్ అకౌంట్ కూ, మధ్యంతర బడ్జెట్ కూ ఉన్న తేడాను గమనిస్తే.. మధ్యంతర బడ్జెట్ అనేది కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి పూర్తి బడ్జెట్‌ను సమర్పించేంత వరకు రాబడి, వ్యయాలు ఉంటాయి కాబట్టి వాటిని వాడుకునేందుకు నిర్దిష్ట కాలానికి ప్రవేశపెట్టే బడ్జెట్ అన్నమాట. కానీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రం ప్రభుత్వ ఖర్చులను మాత్రమే కలిగి ఉంటుంది.
అలాగే మధ్యంతర బడ్జెట్‌లో ప్రధానంగా ప్రస్తుత ఆర్థిక స్థితి, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు, రసీదులు, పన్ను రేట్లలో మార్పులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలు, తదుపరి ఆర్థిక సంవత్సరం అంచనాలు ఉంటాయి. మరోవైపు పార్లమెంటు ఓట్ ఆన్ అకౌంట్‌ను ఆమోదిస్తే అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, కొనసాగుతున్న ప్రాజెక్టుల నిధులు, ఇతర ప్రభుత్వ ఖర్చుల వంటి అవసరమైన ఖర్చులను తీర్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.అలాగే చెల్లుబాటు పరంగా చూస్తే మధ్యంతర బడ్జెట్ ఏడాది పొడవునా చెల్లుబాటు అవుతుంది. కానీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రం రెండు నుండి నాలుగు నెలల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications