గోతి తవ్వుకుంటున్నారు, మాతో సరితూగలేరు, ఏం సాధిస్తారు?: భారత్-జపాన్ మైత్రిపై చైనా అక్కసు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: అత్యాధునిక బుల్లెట్ ట్రెన్స్ ను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ రవాణా వ్యవస్థ ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేయాలని ఎన్డీయే సర్కార్ భావిస్తోంది.

బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీకి కేరాఫ్ అయిన జపాన్.. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన రైల్వే నెట్ వర్క్ కలిగి ఉండటంతో.. భారత్ లో చేపట్టబోయే బుల్లెట్ ప్రాజెక్టును ఆ దేశానికే అప్పగించింది.

What Japan And India Both Gain From New Bullet Train

రూ.1,10,000 కోట్ల నిర్మాణ వ్యయంతో 2023కల్లా ప్రాజెక్టు పూర్తి చేయడానికి జపాన్-ఇండియాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు అవసరమయ్యే ఖర్చులో 88వేల కోట్ల రుణాన్ని జపానే మంజూరు చేయనుంది. వచ్చే 50ఏళ్లలో 0.1శాతం వడ్డీతో ఈ రుణాన్ని భారత్ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ప్రాజెక్టుతో భారత్-జపాన్ మధ్య సంబంధాలు బలపడటం చైనాకు ఇప్పుడు కంటగింపుగా మారింది. ప్రాజెక్టు తమకు దక్కలేదన్న అసహనాన్ని పరోక్షంగా బయటపెట్టుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని అబెల కలయికపై అక్కసు వెళ్లగక్కింది. బుల్లెట్ రైళ్ల విషయంలో ఈ ఇద్దరు తమ గోతిని తామే తవ్వుకుంటున్నారని చైనా అధికారిక వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

ఆసియాలోని ఏ దేశం కూడా సాంకేతికంగాను, జాతీయ భద్రత విషయంలోను చైనాతో సరితూగలేవని చెప్పింది. వేగంగా అబివృద్ధి చెందుతున్న ఆసియా ఖండంలో.. ఎవరు ముందుగా గమ్యాన్ని చేరితే వారే విజేతలవుతారని స్పష్టం చేసింది. ఇందులో ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో ఇప్పటికే చైనా తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా భారత్-జపాన్‌లు ఏం సాధించగలవని చులకన వ్యాఖ్యలు చేసింది.

ఆసియాలోనే అత్యంత సంకుచితమైన తత్వం జపాన్ దేశానిదని, భారత్-చైనా కలిసినంత మాత్రానా తమకొచ్చిన నష్టమేమి లేదని స్పష్టం చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Japan's government and its rail companies lobbied the U.S. for years to sell their bullet-train technology and found little success. Finally, there's an international buyer: India.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X