వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజపేయికి భారతరత్న ప్రదానం: హాజరైన ప్రణబ్, మోడీ, మంత్రులు, ఏపీ నుంచి బాబు...!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా ఆయన నివాసానికి వచ్చి ఈ అవార్డుని అందించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు.

వాజపేయి అనారోగ్యంతో బాధపడున్నందున ఆయన ఇంట్లోనే భారతరత్న అవార్డును ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 24న వాజపేయి పుట్టినరోజుకి ఒక్క రోజు ముందు ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

భారతరత్న అందుకుంటున్న తోలి కాంగ్రెసేతర ప్రధానిగానే కాకుండా జీవితకాలంలోనే ఈ పురస్కరాన్ని అందుకుంటున్న ప్రధానిగా వాజపేయి పేరు నమోదైంది. అంతకముందు జవహార్ లాల్ నెహ్రూ, లాల్‌ బహదూర్‌ శాస్ర్తి, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ మరణించిన తరువాతే భారతరత్నను ప్రకటించారు.

2004 తర్వాత ఆరోగ్య కారణాల రీత్యా వాజపేయి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం మంచానికే పరితమైన వాజపేయి ఆరోగ్యాన్ని నర్సులు ఎలాంటి ఇన్పెక్షన్ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

 వాజపేయికి భారతరత్న ప్రదానం చేసిన ప్రణబ్

వాజపేయికి భారతరత్న ప్రదానం చేసిన ప్రణబ్


మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా ఆయన నివాసానికి వచ్చి ఈ అవార్డుని అందించారు.

వాజపేయి ప్రపంచానేకి మార్గదర్శకుడు: రాజ్‌నాథ్ సింగ్

వాజపేయి ప్రపంచానేకి మార్గదర్శకుడు: రాజ్‌నాథ్ సింగ్

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రపంచానికే మార్గదర్శకుడని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొనియాడారు. వాజపేయికి భారతరత్న ప్రదానం చేసిన సందర్భంలో ఆయన మాట్లాడారు. వాజపేయి భారతరత్న అందుకోవడం గర్వంగా ఉందన్నారు. కేవలం దేశ నాయకుడిగానే గాక, ఒ గోప్ప దార్శనికతతో ప్రపంచ దేశాల్లోనూ ఆయన చెరగని ముద్ర వేశారు.

 వాజపేయికి సమర్దవంతమైన నాయకుడు: జైట్లీ

వాజపేయికి సమర్దవంతమైన నాయకుడు: జైట్లీ

మాజీ ప్రధాని వాజపేయి సమర్ధవంతమైన నాయకుడని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రశంసించారు. ఈరోజు వాజపేయికి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదగా ఢిల్లీలోని ఆయన నివాసంలో భారతరత్న ప్రదానం చేశారు. దీంతో జాతి గర్వించదగ్గ నాయకుడు వాజపేయని కొనియాడాడు. ఆయనకు భారతరత్న దక్కడం పట్ల ఎంతో సంతోషంగా ఉందన్నారు.

 వాజపేయికి భారతరత్న ఇవ్వడం సంతోషం: మమతా బెనర్జీ

వాజపేయికి భారతరత్న ఇవ్వడం సంతోషం: మమతా బెనర్జీ

మాజీ ప్రధాని వాజపేయికి దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వడం పట్ల పశ్చిమబెంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఒ గోప్ప రాజకీయ వేత్త అని, వాజపేయికి భారతరత్న రావడం సంతోషంగా ఉందని ట్విట్టర్లో పేర్కొన్నారు.

English summary
Who has been the most admired among the 15 Prime Ministers India has had so far? The answer is a no-brainer. It was Pandit Jawaharlal Nehru. As a towering leader of India's freedom movement, and later as the principal architect of modern India, Nehru scaled a height in the hearts of Indians that remains unequalled till today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X