వీడ్కోలు: సచిన్ టెండూల్కర్‌పై అత్తగారేమన్నారు?
న్యూఢిల్లీ: దిగ్గజ క్రికెటర్ సచిట్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన నేపథ్యంలో అతని అత్త, అంజలి తల్లి అయిన అన్నాబెల్ మెహతా స్పందించారు. సచిన్ టెండూల్కర్‌కు ఇంకొంత కాలం క్రికెట్ ఆడగల సామర్థ్యం ఉందని, అయితే ప్రస్తుతం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునే ముందు కొంత కాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆమె సూచించారు.
బ్రిటన్ దేశానికి చెందిన అన్నాబెల్ మెహతా ముంబైలోని వీధి బాలల కోసం ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి నిర్వహిస్తోంది. సచిన్ టెండూల్కర్ తన సంస్థకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తారని ఆమె చెప్పారు. సచిన్ టెండూల్కర్ భవిష్యత్ గురించి ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా కొంత కాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని అతనికి సూచిస్తున్నట్లు ఆమె తెలిపారు.

మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ... సచిన్ టెండూల్కర్ క్రికెట్ లేకుండా ఉండలేరని, అతని కుమారుడు అర్జున్ కూడా క్రికెట్ రంగాన్నే ఎంచుకున్నాడని ఆమె తెలిపారు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ తన నివాసంలోని నెట్‌లో అర్జున్‌తోనే క్రికెట్ ఆడుతాడని ఆమె చెప్పారు. సచిన్ టెండూల్కర్ వాంఖడే స్టేడియంలో శనివారం వెస్టిండీస్ జట్టుతో జరిగిన తన చివరిదైన 200వ టెస్టు మ్యచుకు సచిన్ కుటుంబ సభ్యులతోపాటు అన్నాబెల్ మెహతా కూడా హాజరయ్యారు.
తన చివరి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచు ముగిసిన అనంతరం సచిన్ టెండూల్కర్ చేసిన ప్రసంగం తమను ఉద్వేగానికి గురి చేసిందని అన్నాబెల్ తెలిపారు. అదొక అద్భుత ప్రసంగమని, అతను అంత భావోద్వేగాన్ని నియంత్రించుకుని ఏ విధంగా ప్రసంగించాడో తనకు తెలియడం లేదని ఆమె అన్నారు. అతనికి భారతదేశం నుంచి లభించిన గౌరవం, ప్రేమాభిమానాలు అపూర్వమని అన్నాబెల్ తెలిపారు.
సచిన్ టెండూల్కర్ తన ఫిట్‌నెస్ కోసం గోల్ప్ గానీ, టెన్నిస్ ఆటను గానీ ఎంచుకోవాలని ఆమె సూచించారు. అయితే ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఉందని ఆమె చెప్పారు. సచిన్ భార్య అంజలి ప్రస్తుతం తన కుటుంబ బాధ్యతలను కొంతవరకు అతనికి అప్పగించనుందని ఆమె తెలిపారు. సచిన్‌కు సంబంధించి అంజలి మదిలో ఏముందో తనకు తెలియదని చెప్పారు.
క్రికెట్ ద్వారా దేశానికి గొప్ప సేవలందించిన తన అల్లుడు సచిన్ టెండూల్కర్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న రావడం పట్ల అన్నాబెల్ ఆనందం వ్యక్తం చేశారు. అతని నిజాయితీ, చిత్తశుద్ధి, వినయం, మేధస్సు, అంతకుమించి అతను కుటుంబం పట్ల చూపించే ప్రేమ సచిన్‌పై తనకున్న గౌరవాన్ని మరింత పెంచాయని ఆమె తెలిపారు. తనకు ఒక గొప్ప అల్లుడు ఉన్నందకు చాలా ఆనందంగా ఉందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications