యూజర్లకు వాట్సప్ షాక్.. జనవరిలో 29లక్షలకు పైగా ఖాతాలు బ్యాన్!!

యూజర్లకు వాట్సప్ షాక్ ఇచ్చింది. జనవరిలో 29లక్షలకు పైగా ఖాతాలు బ్యాన్ చేసింది. గైడ్‌లైన్స్‌ పాటించకుంటే అకౌంట్లను బ్యాన్ చేస్తామని వాట్సప్‌ పేర్కొంది.

వాట్సప్ యూజర్లకు షాక్ ఇస్తూనే ఉంది. ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం అయిన మెసేజింగ్ సేవ సంస్థ, వాట్సప్ జనవరి నెలలోనూ చాలా మంది భారతీయుల అకౌంట్లను బ్యాన్ చేసింది. దాదాపు జనవరి నెలలో 29 లక్షల ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సప్ వెల్లడించింది.

జనవరి నెలలో 29 లక్షల ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్

జనవరి నెలలో 29 లక్షల ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్

మెటా యొక్క గ్లోబల్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సప్ ప్రతి నెల కొత్త ఐటీ నిబంధనల ప్రకారం నివేదికలను విడుదల చేస్తోంది. ఇక తాజాగా విడుదల చేసిన జనవరి నెల నివేదికలో వాట్సప్ యొక్క మార్గదర్శకాలను ఉల్లంఘించారని అందుకు 29 లక్షలకు పైగా ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. వారి ఖాతాలను వాట్సప్ బ్యాన్చేసినట్టు ప్రకటించింది.

వాట్సాప్ సేవా నిబంధనలను ఉల్లంఘించినందుకుచర్యలు

వాట్సాప్ సేవా నిబంధనలను ఉల్లంఘించినందుకుచర్యలు


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలలోని రూల్ 4(1)(డి) ప్రకారం రూల్స్ పాటించని ఖాతాలు నిషేధించబడ్డాయని వాట్సప్ పేర్కొంది. భారతదేశంలోని వినియోగదారులు వాట్సప్ యొక్క ఫిర్యాదుల మెకానిజమ్‌ల ద్వారా అలాగే భారతదేశ చట్టాలను, వాట్సాప్ సేవా నిబంధనలను ఉల్లంఘించినందుకుచర్యలు తీసుకున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తంగా 29 లక్షల 18 వేల భారతీయ ఖాతాలను నిషేధించిన వాట్సప్, జనవరి ఒకటవ తేదీ నుండి జనవరి 31వ తేదీ వరకు ఈ రిపోర్టును వెల్లడించింది.

 వినియోగదారుల డేటాను సురక్షితంగా ఉంచడం కోసం వాట్సప్ చర్యలు

వినియోగదారుల డేటాను సురక్షితంగా ఉంచడం కోసం వాట్సప్ చర్యలు


వినియోగదారుల డేటాను సురక్షితంగా ఉంచడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఐటీ రూల్స్ కు అనుగుణంగా తాము ఖాతాలను బ్యాన్ చేసే విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నామని వాట్సప్ పేర్కొంది. జనవరి నెలలో 2.9 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించామని వెల్లడించింది. అంతేకాదు డిసెంబర్లో 36 లక్షల అకౌంట్లను నిషేధించిన వాట్సప్ జనవరిలో డిసెంబర్ తో పోలిస్తే తక్కువ ఖాతాలను బ్యాన్ చేసింది.

జనవరి, డిసెంబర్ లలో వాట్సప్ కు ఫిర్యాదులు ఇలా

జనవరి, డిసెంబర్ లలో వాట్సప్ కు ఫిర్యాదులు ఇలా

జనవరి నెలలో 1461 ఫిర్యాదులను ఇండియా నుండి స్వీకరించినట్టు పేర్కొంది. వాటిలో 195 పైన చర్యలు తీసుకున్నామని, 1337 అకౌంట్లను బ్యాన్ చేయాలని పంపించిన రిక్వెస్ట్ లని వాట్సప్ వెల్లడించింది. కాగా మిగిలినవన్నీ సేఫ్టీకి సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి పంపించిన విజ్ఞప్తులని వాట్సప్ పేర్కొంది. ఇదిలా ఉంటే డిసెంబర్ నెలలో భారతదేశం నుండి 1607 ఫిర్యాదులు వచ్చాయని, 166 నివేదికలపై తాము చర్యలు తీసుకున్నామని వాట్సప్ పేర్కొంది.

ఫిర్యాదులపై చర్యల్లో ముందువరుసలో వాట్సప్

ఫిర్యాదులపై చర్యల్లో ముందువరుసలో వాట్సప్

వాట్సప్ యూజర్ ల నుంచి ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు ఆ ఫిర్యాదులకు ప్రతిస్పందిస్తుంది. ఫిర్యాదులపై చర్యలను తీసుకోవడంలోనూ వాట్సప్ ముందు వరుసలో నిలిచింది. తాము హానికరమైన ఖాతాల విషయంలో దృష్టి సారించామని పేర్కొన్న వాట్సప్ హానికరమైన కార్యకలాపాలు జరిగిన తర్వాత గుర్తించడం కంటే, మొదటి దశలోనే గుర్తిస్తే హానికరమైన కార్యకలాపాలు జరగకుండా ఆపడం సాధ్యమవుతుందని భావించి ఈ తరహా చర్యలు మొదలుపెట్టామని వాట్సప్ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+