సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం ఉపవాసం చేసిన నటి శ్రీదేవి!
చెన్నై: శ్రీదేవి సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం ఉపవాసం చేశారా? అంటే అవుననే అంటున్నారు. రజనీ కొచ్చాడయన్ సినిమా సమయంలో ఆయన అనారోగ్యం పాలయ్యారు. మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించారు.
ఈ విషయం తెలిసిన శ్రీదేవి బాధపడటంతో పాటు ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేశారని తెలుస్తోంది. అంతేకాదు, వారం రోజుల పాటు ఉపవాసం కూడా ఉన్నారట.

ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. రజనీకాంత్ - శ్రీదేవిలు ఇరవై సినిమాల్లో నటించారు. శ్రీదేవి చనిపోయిన విషయం తెలియగానే రజనీ స్పందించారు. దేశం గొప్ప సూపర్ స్టార్‌ను కోల్పోయిందని, తాను ఓ మంచి స్నేహితురాలిని కోల్పోయానని చెప్పారు.












Click it and Unblock the Notifications