వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి అధికారంలోకి రావాలని కోరుకోవట్లేదు: ఇది సేవగా భావిస్తున్నా: మన్ కీ బాత్‌లో మోడీ సంచలనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నౌకాదళ దినోత్సవం, సైనిక బలగాల ఫ్లాగ్‌డే, అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. పార్లమెంట్ మొదలుకుని గ్రామ పంచాయతీ వరకూ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని దేశ ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారని పేర్కొన్నారు. చమురు, సహజవాయులను వెలికి తీసే ఓఎన్‌జీసీని చేస్తోన్న సేవలను ప్రశంసించారు.

అమృత్ మహోత్సవ్..

అమృత్ మహోత్సవ్..

అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని వేలాదిమంది విద్యార్థులకు ఓఎన్‌జీసీ అవగాహన కల్పిస్తోందని అన్నారు. స్వాతంత్య్ర పోరాటం, స్వాతంత్య్ర సమరయోధులు, దేశభక్తి.. వంటి పలు కార్యక్రమాలు, డిబేట్లను నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజల్లో దేశభక్తిని రగిలించే అనేక చర్యలను అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టామని ప్రధాని పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వీరుల చిత్రాలను గీయడం, వారు చేసిన త్యాగాలపై ప్రత్యేకంగా వ్యాస పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఆస్ట్రేలియాలో బృందావనం..

ఆస్ట్రేలియాలో బృందావనం..


మధురలోని బృందావనం చరిత్ర.. విదేశాలకు సైతం వ్యాప్తి చెందిందని అన్నారు. ఆస్ట్రేలియన్ మహిళ తాను నివసించే నగరంలో బృందావనాన్ని ఏర్పాటు చేశారని ప్రధాని వివరించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాదిమంది పేదలకు తాము ఉచితంగా వైద్య చికిత్సను అందిస్తున్నామని నరేంద్ర మోడీ చెప్పారు. దీని ద్వారా లబ్ది పొందిన రాజేష్, మధురకు చెందిన సుఖ్‌దేవి అనే లబ్దిదారులతో ఫోన్‌లో మాట్లాడారు.

 ఆయుష్మాన్ భారత్ లబ్దిదారులకు ఫోన్ కాల్..

ఆయుష్మాన్ భారత్ లబ్దిదారులకు ఫోన్ కాల్..


ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా తాను ఉచితంగా గుండెకు శస్త్ర చికిత్సను చేయించుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాజేష్- ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్డు వల్ల తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ- సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దీనికి ప్రధాని మోడీ బదులిస్తూ- తాను అధికారంలో కొనసాగాలని కోరుకోవట్లేదని అన్నారు.

 అధికారం కాదు.. సేవ

అధికారం కాదు.. సేవ

ఇది తనకు దక్కిన అధికారంగా భావించట్లేదని చెప్పారు. కోట్లాదిమంది ప్రజలకు సేవ చేయడానికి లభించిన ఓ అదృష్టంగా భావిస్తున్నానని మోడీ స్పష్టం చేశారు. తన పదవిని అధికారంగా స్వీకరించట్లేదని పేర్కొన్నారు. మరోసారి అధికారంలో రావాలని కూడా కోరుకోవట్లేదని, సేవ చేసే అదృష్టం దక్కాలని మాత్రమే తాను అకాంక్షిస్తున్నానని అన్నారు. ఆయుష్మాన్ భారత్‌ కింద ప్రయోజనాలను పొందిన వారు తమ తోటి వారికి దీని గురించి వివరించాలని, తమ పేర్లను నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని ప్రధాని సూచించారు.

English summary
When we conserve nature, it blesses us with sustenance and protection in return, says PM Narendra Modi during his Mann Ki Baat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X